Divyansha Kaushik : కుర్రకారు మతి పోగొడుతున్న నాగ చైతన్య బ్యూటీ దివ్యాంశ కౌశిక్

- Advertisement -

మజిలీ సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. ఆ మూవీలో కేవలం ఫస్ట్ హాఫ్​లోనే కనిపించినా Divyansha Kaushik.. కనిపించిన కాసేపు మాయ చేసింది. కుర్రకారు మదిని దోచేసింది. ఉత్తరాఖండ్​ ముస్సోరిలో జన్మించిన దివ్యాంశ మజిలీ సినిమా తరువాత సిద్దార్థ్ నటించిన టక్కర్ సినిమాతో తమిళంలో అరంగేట్రం చేసింది.

Divyansha Kaushik
Divyansha Kaushik

దాదాపు మూడేళ్ల తర్వాత ఈ ముద్దుగుమ్మ “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రంతో తెలుగు సినిమాకు రీ ఎంట్రీ ఇచ్చింది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయిన ఈ బ్యూటీ అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి.

Divyansha Kaushik Photos

- Advertisement -

‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో సంప్రదాయ భార్య పాత్రలో దివ్యాంశ కనిపించింది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ‌తో ముద్దు సీన్‌లో నటించింది. దివ్యాంశ కౌశిక్ నటించిన మూడో తెలుగు సినిమా ‘మైఖేల్’ త్వరలో రాబోతోంది. ఈ సినిమాలోనూ హీరో సందీప్ కిషన్‌తో లిప్‌లాక్ చేసింది ఈ బ్యూటీ.

Divyansha Kaushik images

ప్రస్తుతం ఈ భామ చేతినిండా అవకాశాలతో ఈ ఇయర్ కేలండరను తన కాల్షీట్స్​తో నింపేసింది. కేవలం తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా తమిళ సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. అందం, అభినయం సమపాళ్లలో ఉన్న దివ్యాంశ తన స్పీడ్ పెంచడం అభిమానులకు ఆనందం కలిగించే విషయం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here