Rakul Preet Singh : ఆ సినిమాలో తన రోల్ అంటే రకుల్ కు చాలా ఇష్టమట



టాలీవుడ్ బ్యూటీ Rakul Preet Singh కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.  సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

Rakul Preet Singh
Rakul Preet Singh

దశాబ్దకాలంగా చిత్రసీమలో హీరోయిన్​గా రాణిస్తున్న ఈ లక్కీ బ్యూటీ..  ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలోనూ రాణిస్తోంది. సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్​తో కనిపించి ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటోంది. 

Rakul Preet Singh Images

ప్రస్తుతం తెలుగులో కాస్త జోరు తగ్గించినా హిందీలో మాత్రం ఫుల్​ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే హిందీలో అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది. తాజాగా ఛత్రివాలీ అనే సినిమాతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నే రకుల్ బిజీబిజీగా ఉంది.

Rakul Preet Singh Photos

అయితే టాలీవుడ్ లో ఎన్నో కమర్షియల్ సినిమాల్లో నటించిన రకుల్ కు ఓ మూవీలోని తన పాత్ర అంటే చాలా ఇష్టమంట. కొండపొలం చిత్రంలో ఓబులమ్మ పాత్ర అంటే రకుల్ కు చాలా ఇష్టమంట. ఈ సినిమాలో రకుల్ డీ గ్లామర్ పాత్రలో నటించింది.