OTT Releases : ఈ వారం థియేటర్‌/ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే



OTT Releases : బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి ఇంకా కొనసాగుతోంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు ప్రేక్షకులు ఇంకా నీరాజనాలు పడుతూనే ఉన్నారు. గత వారం ఈ రెండు సినిమాలే థియేటర్లలో ప్రేక్షకులను అలరించాయి. ఇక దాదాపు రెండు వారాల తర్వాత మళ్లీ థియేటర్‌లోకి కొత్త సినిమాలు అడుగుపెడుతున్నాయి. అలా జనవరి చివరి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సినిమాలేంటో చూసేద్దామా!

OTT Releases
OTT Releases

ఐదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న షారుఖ్‌..

బాలీవుడ్ బాద్‌షా కింగ్ షారుఖ్ ఖాన్ దాదాపు ఐదేళ్ల తర్వాత తెరపై కనువిందు చేయడానికి వస్తున్నాడు. ఈ ఐదేళ్ల పాటు షారుఖ్ ను మిస్ అయిన అభిమానులంతా ఈ సినిమా కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ మూవీలోని బేేషరమ్ రంగ్ సాంగ్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పాటలో దీపికా పదుకొణె ధరించిన డ్రెస్సు అశ్లీలంగా ఉందంటూ చాలా రచ్చ జరిగింది. ఎట్టకేలకు ఈ వివాదం ప్రస్తుతం కాస్త శాంతించింది.

చిత్రం: పఠాన్‌

నటీనటులు: షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan), దీపిక పదుకొణె (deepika padukone), జాన్‌ అబ్రహాం తదితరులు

సంగీతం: తనిష్‌ బాగ్చి అంకిత్‌ బల్హరా

దర్శకత్వం: సిద్ధార్థ్‌ ఆనంద్‌

విడుదల: 25-01-2023

వేట ఎవరి కోసం..

చిత్రం: హంట్‌ (HUNT)

నటీనటులు: సుధీర్‌బాబు, భరత్‌, శ్రీకాంత్‌ తదితరులు

సంగీతం: జిబ్రాన్‌

దర్శకత్వం: మహేశ్‌

విడుదల: 26-01-2023

గాంధీ.. గాడ్సే.. ఏం జరిగింది

చిత్రం: గాంధీ.. గాడ్సే ఏక్‌ యుధ్‌ (Gandhi Godse – Ek Yudh)

నటీనటులు: దీపక్‌ అనంతని, చిన్మయి మండేల్కర్‌, తనీషా సంతోష్‌ తదితరులు

సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌

దర్శకత్వం: రాజ్‌కుమార్‌ సంతోషి

విడుదల: 26-01-2023

కొత్త సిందూరంచిత్రం: సిందూరం (Sindhooram)

నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ తదితరులు

సంగీతం: హరి

రచన- దర్శకత్వం: శ్యామ్‌ తుమ్మలపల్లి

విడుదల: 26-01-2023

అయ్యప్ప భక్తుల కోసం..

చిత్రం: మాలికాపురం (malikappuram)

నటీనటులు: ఉన్నిముకుందన్‌, ఆల్ఫీ పంజికరణ్‌, సంపత్‌ రామ్‌, సాయిజు కురుప్‌ తదితరులు

సంగీతం: రంజినిరాజ్‌

దర్శకత్వం: విష్ణు శశి శంకర్‌

విడుదల: ఈ వారమే

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు

థియేటర్‌లో అలరించి…నిఖిల్-అనుపమ పరమేశ్వరన్ నటించిన 18 పేజెస్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ లవ్‌స్టోరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. థియేటర్‌లో సూపర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయింది. ఆహా వేదికగా ఈనెల 27న స్ట్రీమింగ్ కానుంది.

చిత్రం: 18 పేజెస్‌

నటీనటులు: నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌

OTT Releases గోపీ సుందర్‌

దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్‌

స్ట్రీమింగ్‌ తేదీ: జనవరి 27

స్ట్రీమింగ్ వేదిక: ఆహా

నెట్‌ఫ్లిక్స్‌

నార్విక్‌ (హాలీవుడ్‌) జనవరి 23

బ్లాక్‌ షన్‌షైన్‌ బేబీ (డాక్యుమెంటరీ) జనవరి 24

18 పేజెస్‌ (తెలుగు) జనవరి 27

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ఎంగ్గా హాస్టల్‌ (తమిళ్‌) జనవరి 27

షాట్‌గన్‌ వెడ్డింగ్‌ (హాలీవుడ్‌) జనవరి 27

యాక్షన్‌ హీరో (హిందీ) జనవరి 27

డిస్నీ+హాట్‌స్టార్‌

ఎక్స్‌ట్రార్డినరీ (ఒరిజినల్‌సిరీస్‌) జనవరి 25

డియర్‌ ఇష్క్‌ (హిందీ) జనవరి 26

సాటర్‌డే నైట్‌ (మలయాళం) జనవరి 27

జీ5

అయలీ (తెలుగు/తమిళ్‌సిరీస్‌) జనవరి 26

జాన్‌బాజ్‌ హిందుస్థాన్‌ కీ (హిందీ) జనవరి 26