Waltair Veerayya మూవీ రేటింగ్స్‌పై చిరంజీవి ఫన్నీ కామెంట్స్

- Advertisement -

సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి Waltair Veerayya సినిమాతో దిగారు. జనవరి 13న విడుదలైన మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ ఊరమాస్ యాక్టింగ్‌కు తెలుగు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు. ఈ మూవీలో చిరు లుక్‌తో ప్రేక్షకులు నోస్టాల్జిక్‌గా ఫీల్ అయ్యారు. చిరంజీవి ఈ అవతార్‌లో చూసి చాలా ఏళ్లవుతుందోని.. డైరెక్టర్ బాబీ చిరంజీవి అభిమానిగా.. తమ కోరికను తెలుసుకుని అభిమానుల కోసమే ఈ సినిమాను తీశారని చిరు ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు. రెండో వారంలోకి అడుగుపెట్టినా ఇంకా థియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూలో బారులు తీరుతున్నారు.

Waltair Veerayya
Waltair Veerayya

ఇక ‘వాల్తేరు వీరయ్య’కు పలు వెబ్‌సైట్స్‌లో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ సినిమా కలెక్షన్ల గురించి కూడా వివిధ రకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. అయితే వీటన్నింటిపైన తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ముఖ్యంగా ఈ చిత్రానికి వస్తోన్న రేటింగ్స్‌పై జోకులు వేశారు. ఎవర్నీ విమర్శించాలనే ఉద్దేశంతో తాను ఈ జోకులు వేయడం లేదని.. కేవలం సరదాగానే చెబుతున్నానని చిరు అన్నారు.

‘‘వాల్తేరు వీరయ్య’ యూఎస్‌ ప్రీమియర్స్‌ చూసి ఇక్కడ పలు వెబ్‌సైట్స్‌లో సినిమా రివ్యూలు రాశారు. పలువురు ఈ చిత్రానికి 2.5 రేటింగ్‌ ఇచ్చారు. వాటిని చూసి.. బాధపడకూడదని అనుకున్నాను. ఎందుకంటే ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ‘ఘరానా మొగుడు’, ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘రౌడీ అల్లుడు’, ‘అన్నయ్య’ చిత్రాల తర్వాత అంతటి పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్న చిత్రమిది. కాబట్టి వాళ్లు ఇచ్చే రేటింగ్‌ను పట్టించుకోవద్దని నిర్ణయించుకున్నా. కానీ, ఆ తర్వాతే తెలిసింది 2.5 అంటే 2.5 మిలియన్ల డాలర్లు అని. యూఎస్‌లో అంత రెవెన్యూ వస్తుందని వాళ్లు ముందే చెప్పారని.. మేమే పొరపాటు పడ్డామని తెలిసింది’’ అంటూ చిరంజీవి నవ్వులు పూయించారు.

- Advertisement -

మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘వాల్తేరు వీరయ్య‘. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని,ర‌విశంక‌ర్ సినిమాను నిర్మించారు. సంక్రాంతి సంద‌ర్బంగా జ‌న‌వ‌రి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. చాలా రోజుల తర్వాత చిరంజీవి మాస్ మసాలా పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చిరు అవతార్‌కు.. ఆయన మాస్‌ యాక్టింగ్‌కు ఈలలు పడేలా చేసింది ఈ మూవీ. ఈ సినిమా తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.131 కోట్ల గ్రాస్​ వసూలు చేసినట్లు సమాచారం. యూఎస్‌లోనూ ఈ సినిమాకు ఘన విజయం దక్కింది. ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో 2 మిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకీ ప్రవేశించింది.

ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేసిన చిరు తాజాగా అమెరికాలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తోన్న పలువురు అభిమానులతో జూమ్‌ కాల్‌లో మాట్లాడారు. తన చిత్రానికి మంచి విజయాన్ని ఇచ్చిన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ‘గాడ్‌ఫాదర్‌’ తర్వాత మెగాస్టార్‌ నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వం వహించిన ఈసినిమాలో రవితేజ కీలకపాత్ర పోషించారు. కేథరిన్‌, శ్రుతిహాసన్‌, ప్రకాశ్‌ రాజ్‌, బాబీ సింహా, రాజేంద్రప్రసాద్‌ తదితరులు ముఖ్యభూమిక పోషించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here