Nagarjuna : వామ్మో.. నాగార్జున తన కెరీర్ లో ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు వదులుకున్నాడా..!

- Advertisement -

Nagarjuna : నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 60 సంవత్సరాల వయసులో కూడా మన్మథుడిగానే కొనసాగుతున్నారు. యువ హీరోగా ఉన్నప్పుడే ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండేవారు. ప్రస్తుతం గతంలోకంటే జోరుగా సినిమాలు చేయనప్పటికీ ఆచితూచి సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు తర్వాత రెండు సినిమాలు ఫ్లాపవడంతో నా సామిరంగ చేసి విజయం అందుకున్నారు. వచ్చే సంక్రాంతికి కూడా మరో సినిమాతో రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తన కెరీర్ లో అక్కినేని నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమాలు చాలావరకు వదులుకున్నారు.

Chiranjeevi-and-Nagarjuna-Akkineni-1200by667

డేట్లు ఖాళీ లేకపోవడంతోపాటు కథ నచ్చినా కొన్ని కారణాలవల్ల చేయడం వీలుపడక వదులుకోవాల్సి వచ్చింది. వాటిల్లో దళపతి, బద్రి, కలిసుందాం రా, మౌనరాగం, మెకానిక్ అల్లుడు, ఘర్షణ.. తదితర ఎన్నో సినిమాలు వదులుకున్నారు. దళపతిలో నాగార్జునను రజనీకాంత్ క్యారెక్టర్ చేయమని మణిరత్నం ముందుగానే అడిగారు. కానీ చేయలేదు. అలాగే మెకానిక్ అల్లుడులో చిరంజీవి పాత్ర చేయాల్సి ఉన్నప్పటికీ బి.గోపాల్ తో అంతకుముందు తనకు ట్రాక్ రికార్డు సరిగా లేకపోవడంతో ముందుకు రాలేదు.

- Advertisement -

బద్రి సినిమా కథ పూరీ ముందుగా నాగార్జునకు చెప్పినప్పటికీ ఎటువంటి సమాధానం రాకపోవడంతో పవన్ కల్యాణ్ తో చేశారు. తర్వాత పూరీ నాగ్ తో శివమణి చేశారు. వెంకటేష్ చేసిన కలిసుందాం రా, ఘర్షణ కథలు కూడా ముందుగా దర్శకులు నాగార్జున వద్దకు తీసుకువెళ్లారు. కానీ కొన్ని కారణాలవల్ల చేయలేకపోయారు. అవి మంచి హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇలా తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు నాగార్జున వదులుకోవాల్సి వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here