Junior NTR : ఎన్టీఆర్ ఆ సినిమా రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చేశాడా.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్!

- Advertisement -

Junior NTR ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దసరాకు విడుదల కాబోతోంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ నెలలో వార్2 చిత్రం షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగానే రూపొందుతున్నాయి. వీటితర్వాత తారక్ ఏ సినిమాలో నటిస్తాడు? అన్నదే అభిమానులకు పెద్ద ప్రశ్నగా మిగిలింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే వార్ 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో రావాల్సిన సినిమా వాయిదా పడుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది చివరి వరకు ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. దీంతో అప్పటివరకు ఆ సినిమా కోసం తనకు ఇచ్చిన అడ్వాన్స్ ను కూడా ఉంచుకోవడం న్యాయం కాదని తారక్ భావించారట. అందుకే నిర్మాతలు తనకిచ్చిన పారితోషికం అడ్వాన్స్ ను వెనక్కి తిరిగిచ్చేశారని తెలుస్తోంది. సినిమా ప్రారంభం కావడం అనేది కాస్తంత ఆలస్యం కానుందని, అప్పటివరకు అడ్వాన్స్ తీసుకోకూడదని, షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికే తీసుకోవాలని తారక్ నిర్ణయించుకున్నారట.

- Advertisement -

ఇదే విషయాన్ని నిర్మాత, దర్శకులకు కూడా చెప్పారు. అయితే తారక్ అడ్వాన్స్ ను వెనక్కి తిరిగివ్వడంతో సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఫిలింనగర్ వర్గాలు ఖండిస్తున్నాయి. అటువంటిదేమీ లేదని, సినిమా ఉంటుందని, కాకపోతే కాస్త పోస్ట్ పోన్ అయిందని, ఈ ఏడాది దేవర విడుదలైన తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here