జర్నీ టు అయోధ్య.. బాలీవుడ్ లో కాదు టాలీవుడ్ లో రామాయణం

- Advertisement -

రామాయణ ఇతిహాసం ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. రామాయణం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పడానికి ఏదో మిగిలే ఉంటుంది. ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. దర్శకులు ఇంకాా ఇంకా రామాయణం గురించి సినిమాలు తీస్తూనే ఉన్నారు. గతేడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కిందే. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

మరోవైపు ప్రస్తుతం బాలీవుడ్ లోనూ రామాయణం ఆధారంగా రామాయణ్ అనే మూవీ తెరకెక్కిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నితేష్ తివారీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఇందులో రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడి పాత్రలో రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా దీనిపై అఫీషియల్ అప్డేట్ రాలేదు.

- Advertisement -

ఈ సినిమా గురించి ఏ అప్డేట్ రాకముందే మరోవైపు టాలీవుడ్ లో రామాయణం ఆధారంగా మరో సినిమా తెరకెక్కుతోంది. శ్రీరామనవమి సందర్భంగా చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై నిర్మాత వేణు దోనేపూడి ఈ సినిమాను ప్రకటించారు. జర్నీ టు అయోధ్య వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య ఈ ప్రాజెక్ట్ కు కథ అందిస్తుండగా ఓ యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నారు.

ఈ ప్రాజెక్ట్ లో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లో సినిమాకు సంబంధించి అన్ని వివరాలను ప్రకటించనున్నారట. మూవీ అనౌన్స్మెంట్ సమయంలో పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో రాముడు ఒక బ్యాగ్ పట్టుకుని అయోధ్యకు వెళ్తున్నట్లు చూపించారు.

ఇంకా 1177 కిలోమీటర్ల గమ్యం ఉన్నట్లు రాసి ఉన్న ఈ పోస్టర్ లో #AAGAMAN 2025 ట్యాగ్ కనిపించింది. దీని బట్టి చూస్తే.. ఈ సినిమా 2025లో విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. కంప్లీట్ డీసెంట్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న అనౌన్స్మెంట్ పోస్టర్.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుందని సినీ ప్రియులు కామెంట్ చేస్తున్నారు.  అయోధ్య బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here