Hebha Patel: హెబ్బా.. నీ అందంతో కుర్రకారు మతిపోతోందబ్బా..



నా పేరు కుమారి.. నా వయసు 21.. అంటూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది Hebha Patel. అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వచ్చిన కుమారి 21ఎఫ్‌తో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎక్కడికిపోతావు చిన్నవాడా మూవీతో ఈ బ్యూటీ ఫాలోయింగ్ ఒక్కసారిగా ఓ రేంజ్‌కు వెళ్లింది. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన హెబ్బా ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Hebha Patel
Hebha Patel

కన్నడలో అధ్యక్ష అనే మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తిరుమనమ్ ఎరుం ఇక్కా అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంటర్ అయింది. ఆ తర్వాత అలా ఎలా చిత్రంతో టాలీవుడ్‌లో తన ప్రయాణం షురూ చేసింది. ఎక్కడికిపోతావు చిన్నవాడాలో డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్ చేసిన హెబ్బా క్రేజ్ టాలీవుడ్‌లో అమాంతం పెరిగింది.

ఆ సినిమా తర్వాత హెబ్బా అడపాదడపా మూవీస్ చేసింది. అవేమీ హిట్ కాకపోవడంతో ఆ తర్వాత ఈ బ్యూటీకీ అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ప్రస్తుతం అప్పుడప్పుడు కొన్ని మూవీస్‌లో క్యామియో రోల్స్‌లో కనిపిస్తోంది. ఇటీవలే ఓదెల రైల్వే స్టేషన్‌ అనే మూవీతో హీరోయిన్‌గా మళ్లీ కమ్‌బ్యాక్‌ ఇచ్చింది.

అవకాశాలు లేకపోయినా.. సినిమాలు తీయకపోయినా.. హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ప్రతిరోజు తన ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కి గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.