Hebah Patel : అబ్బా.. హెబ్బా ఎంత ముద్దొచ్చేస్తున్నావో..

- Advertisement -

హెబ్బా పటేల్.. అలా ఎలా అంటూ మొదటి సినిమాతోనే కుర్రకారు మదిని దోచేసింది. ఆ తర్వాత నా పేరు కుమారి అంటూ కుమారి 21ఎఫ్ తో యువకుల గుండెలు కొల్లగొట్టేసింది Hebah Patel . ఎంతలా అంటే ఈ సినిమా తర్వాత యూత్ అంతా హెబ్బాను కుమారి అనే పిలుచుకునే అంత. ఆ తర్వాత తనకు సూపర్ హిట్ ఇచ్చిన హీరో రాజ్ తరుణ్ తోనే మరో మూవీ ఈడో రకం ఆడో రకం చేసింది. అది కూడా బాగానే ఆడింది.  రెండు వరసు హిట్ లతో మూడో మూవీ యంగ్ హీరో నిఖిల్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడాలో నటించింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్టే. ఇలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలోనే హ్యాట్రిక్ కొట్టేసింది హెబ్బా.

Hebah Patel
Hebah Patel

అబ్బా.. ఇక హెబ్బా సూపర్ స్టార్ లీగ్ లో ఎంటర్ అయినట్టే అనుకున్నారంతా. అప్పుడే మిస్టర్ సినిమా తీసింది. మెగా హీరోతో జతకట్టినా ఆ హీరో స్టార్ డమ్ ఈ మూవీకి, హెబ్బాకు ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. ఆ తర్వాత తనకు బ్యాక్ టూ బ్యాక్ రెండు హిట్లు ఇచ్చిన రాజ్ తరుణ్ తో మళ్లీ జతకట్టింది. ఈసారి రాజ్ తో హ్యాట్రిక్ పక్కా అని ఫిక్స్ అయి అంధగాడు అనే సినిమా తీసింది. కంటెంట్ పరంగా ఓకే.. కామెడీ ఓకే అయినా టేకింగ్ లో కాస్త తడబాటు వచ్చి రొటీన్ సీన్లతో సినిమా సక్సెస్ కాలేకపోయింది. ఇలా వరుసగా రెండు ఫ్లాప్ లు కుమారి ఖాతాలో పడ్డాయి.

- Advertisement -

ఇక అప్పడి నుంచి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి హెబ్బా చాలా కష్టపడుతోంది. తనకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఎలాగైనా సరే స్క్రీన్ పై కనిపించాలని ట్రై చేస్తోంది. అందులో భాగంగా కొన్ని క్యామియోలు, మరి కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. రీసెంట్ గా ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీతో వచ్చింది. ఈ సినిమాలో హెబ్బా డీ గ్లామర్ రోల్ లో నటించింది. తన అందంతో కుర్రకారుని కట్టిపడేసే హెబ్బాను యువత ఆ రోల్ లో చూడలేకపోయారు. ఇక ఆ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.

హెబ్బా కెరీర్ లో ఎన్ని ఎత్తు పల్లాలున్నా.. ఎన్ని ఫ్లాప్ లున్నా.. తనకు అవకాశాలు రాకుండా లేవు. ఏదో రకంగా ఛాన్స్ తన కెరీర్ తలుపు తడుతూనే ఉంది. సినిమాలు అంతగా హిట్ కాకపోయినా హెబ్బాకి ఫ్యాన్స్ కు కొదువేం లేదు. కుమారి 21ఎఫ్ నుంచి ఈ కుమారిని అభిమానిస్తున్న వాళ్లంతా అలాగే కంటిన్యూ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో హెబ్బాకు మామూలు అభిమానులు లేరు.

సోషల్ మీడియాలో హెబ్బా హైపర్ యాక్టివ్. ఎప్పుడు తన ట్రావెల్, లైఫ్, కెరీర్ కి సంబంధించిన అన్ని విషయాలను ఈ బ్యూటీ తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో మాట్లాడుతుంది కూడా. ఇక ఈ హాట్టీ పోస్ట్ చేసే హాట్ హాట్ ఫొటోలకు మతిచెడని కుర్రాడుండడు. రీసెంట్ గా హెబ్బా లైట్ ఎల్లో శారీలో మిర్రర్ ముందు ఫొటోలకు పోజిచ్చింది. అవి కాస్త తన అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుంది.  ట్రాన్స్ పరెంట్ శారీలో నడుము అందాలు చూపిస్తూ హెబ్బా కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసేస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here