Madhi Movie Review: ‘మది’తో శ్రీరామ్ నిమ్మల హిట్ కొట్టేసినట్టేనా..?

- Advertisement -

నటులు : శ్రీరామ్‌ నిమ్మల, రిచా జోషి, స్నేహ మాధురి శర్మ, శ్రీకాంత్, యోగి ; దర్శకుడు : నాగధనుష్‌ ; నిర్మాత : రామ్‌కిషన్‌ ; మ్యూజిక్ డైరెక్టర్ : పీవీఆర్‌ రాజా స్వరకర్త.

మరికొద్ది రోజుల్లో క్రిస్మస్, ఆ తర్వాత సంక్రాంతి వస్తున్నాయి. ఈ రెండు పండుగల సీజన్‌లో బాక్సాఫీసు వద్ద అగ్రహీరోల సినిమాల హవా నడుస్తుంది. అందుకే చిన్న సినిమాలన్నీ ఈలోపే రిలీజ్‌ అవుతాయి. గత వారం లాగే ఈ వారం కూడా థియేటర్ల వద్ద చిన్న సినిమాలు క్యూ కట్టాయి. యశోద మినహా ఈ వారమంతా చిన్న సినిమాలదే జోష్. అందులో ఒకటి ‘మది’ మూవీ. ఉత్తర మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న హైదరాబాద్ కుర్రాడు శ్రీరామ్ నిమ్మల ఈ సినిమాలో కథానాయకుడిగా నటించారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే ఒకే ఏడాదిలో బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలతో వస్తూ హిస్టరీ క్రియేట్ చేశాడు ఈ యువహీరో. మది సినిమాలో శ్రీరామ్ రిచా జోషితో జతకట్టాడు. నాగధనుష్ దర్శకత్వం వహించిన Madhi Movie Review ఇవాళ థియేటర్లలో సందడి చేస్తుంది. మరి చిన్న సినిమాగా రిలీజ్ ఈ మది ప్రేక్షకులను మదిని దోచేసిందా లేదా చూద్దాం.

Madhi Movie Review
Madhi Movie Review

ఇదీ స్టోరీ : అభిమన్యు(శ్రీరామ్ నిమ్మల), మధు(రిచా జోషి) ఇద్దరు పక్కపక్క ఇళ్లలో ఉంటారు. చాలా రోజుల నుంచి వీళ్లిద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ కులం అనే భూతం వీళ్లిద్దరిని విడదీస్తుంది. మధు వాళ్ల నాన్న తనకు వాళ్ల కులానికి చెందిన వేరే అబ్బాయితో పెళ్లి చేస్తాడు. పెళ్లి తర్వాత కూడా మధు, అభిలు వాళ్ల ప్రేమను కొనసాగిస్తారు. మరి వీళ్లిద్దరి లవ్‌ స్టోరీ చివరకు ఏ మజిలీ చేరిందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

- Advertisement -

ఎలా ఉందంటే.. ప్రేమ, విరహం, ప్రళయం ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ మూవీకి ట్యాగ్‌లైన్ పర్‌ఫెక్ట్‌గా సరిపోయింది. ప్రేమ.. పెళ్లి వరకు దారితీసే క్రమంలో కులం దగ్గరే ఎలా మర్డర్ అవుతుందనేది ఈ మూవీలో చక్కగా చూపించారు. మానవ సంబంధాలపై కులం ప్రభావం ఏ రేంజ్‌లో ఉంటుందో చక్కగా చూపించారు. కాలం మారుతోంది.. మారుతున్న కాలానికి తగ్గట్లు మన ఆలోచనలు కూడా మార్చుకోవాలన్న విషయాన్ని ఈ మూవీలో కొన్ని సీన్లలో హృద్యంగా చూపించారు. సమాజ పోకడలు, పాతకాలపు ఆలోచనల వల్ల అభి, మధులు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో చూపించే సీన్లు.. నేటి సమాజంలో చాలా మంది యువత ఎదుర్కొంటున్న సమస్యలకు అద్దం పట్టేలా ఉన్నాయి.

ఈ మూవీలో అభి-మధుల లవ్‌స్టోరీ చూసిన ప్రతి యువతీ యువకుడు అరె.. ఇది మన స్టోరీలాగే ఉందని అనుకోకుండా ఉండరు. మధు పెళ్లికి ముందు వాళ్ల లవ్‌స్టోరీకి యూత్ బాగా అట్రాక్ట్ అవుతుంది. పెళ్లి తర్వాత కూడా వాళ్లు వాళ్ల లవ్‌స్టోరీని కొనసాగించడం అనే పాయింట్ ఈ మూవీని మిగతా లవ్‌స్టోరీలకు భిన్నంగా ఉందని చూపిస్తుంది. ఇక ఈ మూవీ క్లైమాక్స్‌ సీన్స్‌కు యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ కూడా కనెక్ట్ అవుతారు. ఇది మెసేజ్ ఇవ్వడం అనడం కంటే ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ యుద్ధంలో ఎలా పోరాడారు.. చివరకు ఎలా గెలిచారు అనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించారు అనడం కరెక్ట్. క్లైమాక్స్ సీన్‌తో సినిమా ముగించిన తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.

యాక్టింగ్ ఎలా చేశారంటే..: శ్రీరామ్ నిమ్మల.. ఈ హైదరాబాదీ కుర్రాడి నటనకు ప్రేక్షకులు తప్పక ఫిదా అవ్వాల్సిందే. ఫస్ట్ హాప్‌లో కూల్‌గా, హ్యాపీ బాయ్‌ఫ్రెండ్‌గా ఉండే శ్రీరామ్.. సెకండాఫ్‌లో హార్ట్ బ్రేక్ అయిన ఓ భగ్న ప్రేమికుడిగా నటించిన తీరు ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాల్లో శ్రీరామ్ చెప్పే డైలాగులు నేరుగా హృదయాన్ని తాకుతాయి. ప్రతి అమ్మాయి ఇలాంటి అబ్బాయి తన బాయ్‌ఫ్రెండ్‌గా రావాలి అనిపించేలా ఉంటుంది శ్రీరామ్ యాక్టింగ్. రిచా జోషి మన పక్కింటి అమ్మాయిగా అందంగా కనిపిస్తుంది. ఒక్కసారి ప్రేమిస్తే ప్రేమించిన వాడికోసం ఎన్ని హద్దులైనా దాటేయగల పాత్రలో రిచా చక్కగా నటించింది. ఇక స్నేహ మాధురి శర్మ, శ్రీకాంత్, యోగి, ఇతరులు వారి పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ పరంగా ఈ మూవీ చాలా బాగుంది. నాగ ధనుశ్ సినిమాను చక్కగా తెరకెక్కించారు. స్క్రీన్‌ప్లై కాస్త స్లోగా సాగినట్టు అనిపించినా అభి-మధుల వచ్చే ప్రేమ, సంఘర్షణ సన్నివేశాలు ప్రేక్షకులు కథ నుంచి బయటకు రాకుండా సినిమాకు కట్టిపడేస్తాయి. సినిమాలో పాటలు అంతగా ఆకట్టుకునేలా లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు బలం చేకూర్చింది. ఎమోషనల్‌ సీన్లలో డైలాగ్‌కు బీజీఎం ప్రాణం పోసింది.

కన్‌క్లూజన్‌: మీ ఫస్ట్‌లవ్‌ని గుర్తు చేసుకోవాలంటే మదిదోచే ‘మది’ సినిమా తప్పక చూడాల్సిందే

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Rating: 2.5/ 5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here