Dhamaka : ‘ధమాకా’ హిట్ తో భారీగా పెంచెసిన శ్రీ లీల..ఏకంగా అంతనా..

- Advertisement -

Dhamaka : రాఘవేంద్రరావు రూపొందించిన పెళ్లి సందD తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీలీల..హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ సరసన నటించింది.. ఆ సినిమా తో ఫెమస్ అయ్యింది. నిజానికి ఈ కన్నడ బ్యూటీ కిస్` అనే కన్నడ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో నటించింది..ఇక సినిమా ఫలితం గురించి పక్కన పెడితే శ్రీలీలకు మాత్రం విమర్శకులు నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత శ్రీలీలకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.. పలు సినిమాలు కూడా చేసింది..

Dhamaka Heroine
Dhamaka Heroine

తాజాగా ఈ ముద్దుగుమ్మ నుంచి వచ్చిన రెండో సినిమా ధమాకా…మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస ఎంటర్టైనర్ ఇది. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతుంది. సంక్రాంతి వరకూ ఎటువంటి సినిమా పోటీ లేక పోవడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.. అయితే ధమాకా హిట్ తో శ్రీ లీల తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిందంటూ తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.

Sreelela
Sreelela

పెళ్లి సందD, ధమాకా చిత్రాలకు రూ. 40 లక్షల రేంజ్ లో పారితోషికం అందుకున్న శ్రీలీల.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.1.5 కోట్లు డిమాండ్ చేస్తుందట.ఒక హిట్ పడటంతో ఇంత పెరగడంతో అందరి నోట్లో నానుతుంది..శ్రీలీల ప్రస్తుత ప్రాజెక్టుల విషయానికి వస్తే.. బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో శ్రీలీల నటించబోతోంది.

- Advertisement -
Actress Sreelela
Actress Sreelela

అలాగే రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపిక అయింది. నవీన్ పోలిశెట్టి సరసన అనగనగా ఓ రాజు, నితిన్ కి జోడిగా జూనియర్ చిత్రాలు చేసేందుకు ఇప్పటికే శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కూడా శ్రీలీల ఓ సినిమా చేయబోతుంది. వీటితో పాటు త్రివిక్రమ్ మహేష్ కాంబోలో తెరకెక్కబోయే ఎస్ఎస్ఎమ్‌బీ 28లో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి.. వీటితో పాటు కన్నడ మూవీ లలో కూడా చేస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here