Sreeleela : ఆ హీరోతో ప్రేమలో పడ్డ శ్రీలీల.. ఐ లవ్యూ ఇడియట్ అంటూ..

- Advertisement -

టాలీవుడ్​లో ప్రస్తుతం ట్రెండ్​లో ఉన్న హీరోయిన్లలో ఒకరు శ్రీలీల Sreeleela. ప్రస్తుతం ఈమె పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పెళ్లి సందD మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ మూవీ అంతగా హిట్​ కాకపోయినా.. అందులో అందాల ఆరబోతతో ఆఫర్లు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ప్రజెంట్ టాలీవుడ్​లో ఈమే బిజీ హీరోయిన్​ అని చెప్పొచ్చు. యూత్​లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజే వేరు. కుర్రాళ్లు శ్రీలీల అంటే పడి చచ్చిపోతున్నారు.

శ్రీలీల ప్రస్తుతం ‘ఐ లవ్ యూ ఇడియట్’ అనే మూవీలో నటిస్తోంది. ఈ యూత్​ఫుల్ ఎంటర్​టైనర్​ను అవిరుద్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ తెరకెక్కిస్తోంది.బెక్కెం వేణుగోపాల్, వసంత సమర్పణలో ఐ లవ్‌ యు ఇడియట్‌ అనే సినిమా వస్తోంది. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్్​గా రాబోతున్న ఈ సినిమాకు ఏపీ అర్జున్‌ దర్శకత్వం వహిస్తుండగా.. విరాట్‌ హీరోగా నటిస్తున్నాడు. సాయి కిరణ్‌ బత్తుల, సుదర్శన్‌ గౌడ్‌ బత్తుల, ఎపి అర్జున్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్‌ 17న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది ఈ సినిమా.

చిత్ర ప్రమోషన్స్​లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ‘ బెక్కెం వేణుగోపాల్ గారి ప్రెజెన్స్​లో మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము విడుదల చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి చిత్రాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఒక మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రాలను ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమా నిర్మించాము. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పెద్ద చిత్రాల్లో నటిస్తున్న శ్రీ లీల మా చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఆమె అందం, అభినయం మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు.’ ప్రొడ్యూసర్‌ సాయి కిరణ్‌ బత్తుల అన్నారు.

- Advertisement -
Sreeleela I Love You idiot Movie Trailer
Sreeleela I Love You idiot Movie Trailer

‘చిన్న సినిమాలకు సపోర్ట్ గా నిలిచే బెక్కెం వేణు గోపాల్ గారు మా సినిమా రిలీజ్ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మేము విడుదల చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.‘ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ చిత్రం ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఈ నెల 17న వస్తోన్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’ అని సినిమా డైరెక్టర్ అర్జున్​ అన్నారు.

శ్రీలీల ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజతో ధమాకా సినిమాలో నటిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్​గా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. దీంతో పాటు శ్రీలీల నటించిన పలు సినిమాలు రిలీజ్ కోసం ముస్తాబవుతున్నాయి. మరోవైపు బాలకృష్ణ-అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య కూతురిగా నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. ఇదే కాకుండా రామ్ పోతినేని-బోయపాటి శ్రీను డైరెక్షన్​లో వస్తోన్న ఊర మాస్ ఎంటర్​టైనర్​లో నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here