Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..ఆ ఫోటో వైరల్ కావడంతో..

- Advertisement -

Prabhas : పాన్ స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి తర్వాత మంచి పేరు అయితే వచ్చింది కానీ సరైన హిట్ మాత్రం పడలేదు.. కానీ చేతి నిండా సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నాడు.. ప్రస్తుతం సెట్స్ పై ఆసక్తికరమైన కాంబినేషన్స్ లో విభిన్నమైన సినిమాలు అయితే చేస్తున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ మొదలైనా కూడా ఇంతవరకు అఫీషియల్ గా ఒక్క క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అయిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. అందులో ప్రభాస్ న్యూ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఆ లుక్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి..

Prabhas
Prabhas

పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్ లో అతను అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం అతను దేశంలోనే అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రభాస్ తన పారితోషికాన్ని 100 కోట్ల నుంచి 150 కోట్ల రేంజ్ కు తీసుకు వచ్చాడు. రాబోయే సినిమాలు సక్సెస్ అయితే ఆ సంఖ్య మరింత పెరగవచ్చు..

ఇప్పుడు ఆయన అందరి స్టార్ హీరోల కన్నా కాస్త స్పీడ్ గా ఉన్నాడు.భారీ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టాడు. రొటీన్ గా కాకుండా భిన్నమైన తరహాలోనే ప్రభాస్ కొత్త తరహా ప్రాజెక్ట్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే ప్రభాస్ బిగ్ బడ్జెట్ సినిమాలను వరుసగా లైన్ లో పెట్టినప్పటికి బాహుబలి అనంతరం సరైన సక్సెస్ చూడలేదు. వరుసగా సాహో, రాధే శ్యామ్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.అయితే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు..ఆ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు కూడా అధికారికంగా ఎలాంటి క్లారిటి ఇవ్వకపోవడం షాకింగ్ అనే చెప్పాలి. ఫ్యాన్స్ అయితే మారుతితో అసలు సినిమా వద్దని వాదిస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం మారుతి కంటెంట్ మీద నమ్మకంతో అతనితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట..

- Advertisement -
Actor Prabhas
Actor Prabhas

డార్లింగ్ డ్తె హార్డ్ ఫ్యాన్స్ మాత్రం అతనితో సినిమా చెయ్యొద్దని చెబుతున్నారు.అప్డేట్ అయితే ఎవరు కోరుకోవడం లేదు. ఫ్యాన్స్ కు అయితే తప్పకుండా సరైన కంటెంట్ ఇవ్వాలని మారుతి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూట్ లోకేషన్ కు కు సంబంధించిన ఒక ఫొటో అయితే ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ప్రభాస్ న్యూ స్టైల్ లో కనిపిస్తున్న విధానం చూస్తుంటే మారుతి ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది. మరి ఈ ప్రాజెక్ట్ పై అప్డేట్ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here