Deepika Padukone : మోడ్రన్ డ్రెస్సుల్లో బాలీవుడ్ మస్తానీ పోజులు అదరహో..



బాలీవుడ్ మస్తానీ దీపికా పదుకొణె గురించి తెలియని వారుండరు. అప్పర్ మిడిల్ క్లాస్​ నుంచి వచ్చిన ఈ బ్యూటీ హిందీ సినిమా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగింది. ఓ చిన్న సూట్​కేసుతో బెంగళూరు నుంచి ముంబయిలో అడుగుపెట్టిన Deepika Padukone తన ఆశయాన్ని అవకాశాలుగా మల్చుకుని బాలీవుడ్ స్టార్ హీరోయిన్​గా ఎదిగింది.

Deepika Padukone
Deepika Padukone

బాలీవుడ్​లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్​ల లిస్టు తీస్తే అందులో ఫస్ట్ పేరు దీపికాదే ఉంటుంది. శిల్పంలా చెక్కిన అందం.. మనోహరమైన చిరునవ్వు.. రాకుమారి లాంటి ఆహార్యం ఆమెను బాలీవుడ్ మస్తానీని చేశాయి. బాలీవుడ్​లో హీరోయిన్​ సెంట్రిక్ పాత్రలు చేయాలన్నా.. మహారాణి లాంటి క్యారెక్టర్​లో యాక్ట్ చేయాలన్నా.. గ్లామరస్ రోల్స్ చేయాలన్నా డైరెక్టర్ల ఫస్ట్ ఛాయిస్ దీపికానే.

ఇక ఫ్యాషన్​లో దీపికాకు ఎవరూ సాటిరారు. చీర కట్టినా.. లెహంగా వేసుకున్నా.. ట్రెండీ దుస్తుల్లో అయినా ఈ మస్తానీ అందరి మనసు దోచేస్తుంది. ఇక మోడ్రన్ డ్రెస్సుల్లో అయితే దీపికా హాట్​నెస్​కి హోల్ ఇండియా ఫిదా. తాజాగా దీపకా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు సెగలు పుట్టిస్తున్నాయి. మోడ్రన్ డ్రెస్సులో దీపు అందాలు కుర్రకారుకు కైపెక్కిస్తున్నాయి.

దీపిక సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్​గా కీర్తి గడించిన దీపిక తాజాగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆనందంలో తన సొంత బ్రాండ్​ను లాంఛ్ చేసింది. 82 ఈస్ట్ అనే పేరుతో సెల్ఫ్ కేర్​ బ్రాండ్​ను ప్రకటించింది. రెండేళ్ల క్రితమే సెల్ఫ్ కేర్ బ్రాండ్​ను ప్రారంభించాలని అనుకున్నట్లు దీపికా చెప్పింది. పలు కారణాల వల్ల కాస్త ఆలస్యమైందని.. ప్రస్తుతం ఇది ఇండియాలో మాత్రమే లాంఛ్ చేసినట్లు తెలిపింది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా దీన్ని పరిచయం చేస్తామని పేర్కొంది.

 

దీపికా ప్రస్తుతం పఠాన్ సినిమాతో పాటు ప్యాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కెలోనూ ప్రధాన పాత్రలో నటిస్తోంది. దీపికా పదుకొణె తాను ఓ మానసిక సమస్య బాధితురాలిని అని చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకుంది. ఇలా తన మానసిక సమస్య గురించి బయటకు చెప్పి తొలి హీరోయిన్ దీపికానే. చెప్పడమే కాకుండా తనలా ఇబ్బంది ఎదుర్కొంటున్న వారిని ఆదుకునేందుకు లివ్ లవ్ లాఫ్ అనే సంస్థను కూడా ప్రారంభించింది.

ఇప్పటిదాక దాకా నగరాలకే పరిమితమవుతూ వచ్చిన ఈ సంస్థ ఇప్పుడిప్పుడే పల్లెల వైపు అడుగులేస్తోంది. అందులో భాగంగా ఆరు నెలల కిందట తమిళనాడు తిరువళ్లూరులో సేవల్ని మొదలుపెట్టింది. ఇటీవల అక్కడికొచ్చిన దీపిక తన సంస్థ అక్కడి జీవితాలను మార్చిన తీరు చూసి సంబురపడిపోయింది.