సానియా-షోయబ్ విడాకులు నిజమేనా.. లేక పబ్లిసిటీ స్టంటా..?

- Advertisement -

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ విడాకులు తీసుకోనున్నారు.. త్వరలోనే విడాకుల ప్రకటన చేయబోతున్నారు.. ఇవీ ఇటీవల నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వార్తలు. ఈ దంపతుల సన్నిహితులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారని, న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకుని విడాకుల ప్రకటన చేస్తారనే వ్యాఖ్యలు వినిపించాయి.

సానియా-షోయబ్ విడాకులు
సానియా-షోయబ్ విడాకులు

కానీ ఇప్పుడవన్నీ కేవలం ఊహాగానాలేనా? అనే సందేహం కలుగుతోంది. పాకిస్థాన్‌కు చెందిన ఉర్దూ ఓటీటీ వేదిక ఉర్దూఫ్లిక్స్‌ కోసం ఈ జోడీ కలిసి ‘ది మీర్జా మాలిక్‌ షో’ పేరుతో టాక్‌ షో చేస్తుండడమే అందుకు కారణం. త్వరలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుందని ఉర్దూఫ్లిక్స్‌ ప్రకటించింది. అంతే కాకుండా షోయబ్‌ భుజం మీద సానియా చేయి వేసి దిగిన ఫొటోనూ పోస్టు చేసింది. దీంతో ఈ జంటపై నెటిజన్లు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

- Advertisement -

సానియా, షోయబ్‌ దంపతులు కేవలం ప్రచారం కోసమే విడాకుల నాటకాలాడుతున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ షూటింగ్‌ గతంలోనే జరిగి ఉంటుందని, ప్రసారానికి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే విడాకుల ప్రకటన వాయిదా వేసి ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమం ప్రసారం తర్వాత వీళ్లు విడాకులపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని మరికొంతమంది అంటున్నారు.

మరోవైపు షోయెబ్-సానియా విడాకుల పుకార్ల వేళ.. షోయబ్​ మాలిక్ గతేడాది ఓ మ్యాగజైన్ కోసం పాక్ మోడల్ అయేషా ఓమర్​తో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ ఫొటోలను ఆయేషా తన ఇన్​స్టా ఖాతాలో షేర్​ చేసింది. ఆ ఫొటోల్లో షోయబ్​, అయేషా​లు చాలా సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని చూసిన సానియా ఫ్యాన్స్​ మండిపడుతున్నారు. అదే సమయంలో సానియా కూడా మనసు ముక్కలైందంటూ వరుస పోస్టులు చేసింది. ఆ ఫొటోల వల్లే సానియా, షోయబ్​లు విడిపోతున్నారంటూ ఊహాగానాలు తెగ షికారు చేస్తున్నాయి.

ఇప్పటికీ ఇన్​స్టాలో షోయెబ్​ మాలిక్​ను సానియా మీర్జా ఫాలో అవుతోంది. కానీ ఇటీవల సానియా పెట్టిన పోస్టులు మాత్రం విడాకుల వార్తలను నిజం చేసేలాగే ఉన్నాయి. దీనికి మరింత బలం చేకూర్చేటట్లు మరో విషయం బయటకు వచ్చింది. సానియా, మాలిక్ దుబాయ్​లోని పామ్​ జుమేరియాలోని ఓ విల్లాలో ఉండేవారట. ప్రస్తుతం సానియా అక్కడి నుంచి వేరే అపార్ట్​​మెంట్​కు వెళ్లినట్లు సమాచారం.

షోయబ్​ మాలిక్​ ఇటీవల సానియా గురించి ఓ క్రికెట్​ షోలో కీలక వ్యాఖ్యలు చేశాడు. సానియా టెన్నిస్​ అకాడమీల లొకేషన్​ గురించి అడిగితే అంతగా తెలియదని సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం ఆ షో వ్యాఖ్యాతలను ఆశ్చర్యపరచింది. 2010లో వివాహ బంధంతో ఒక్కటైన సానియా, మాలిక్​.. అప్పటి నుంచి దుబాయ్​లో ఉంటున్నారు. జనవరిలో తాను టెన్నిస్​ నుంచి రిటైర్మెంట్​ తీసుకుంటున్నట్లు సానియా ప్రకటించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here