బాలీవుడ్ మిస్టర్ పర్​ఫెక్ట్ ఆమిర్ ఖాన్ సంచలన నిర్ణయం.. కెమెరా ముందుకు వెళ్లేదే లేదంటూ..

- Advertisement -

సినిమాల్లోకి రావాలని చాలా మంది కలలు కంటుంటారు. ఆ కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. చివరకు ఆ కల నిజమవుతుంది. వచ్చిన ఒక్కొక్క ఛాన్స్ సద్వినియోగం చేసుకుంటూ తమ కెరీర్​లో ముందుకెళ్తుంటారు. అలా వరుస అవకాశాలతో చాలా బిజీ అవుతారు. ఎంత బిజీ అంటే ఒక పూట కుటుంబంతో కలిసి కూర్చొని భోజనం చేయలేనంత. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని ఉన్నా టైం ఉండదు. అలా కెరీర్​ కోసం ఫ్యామిలీని త్యాగం చేసేస్తుంటారు కొందరు. ఇలా గత 35 ఏళ్లుగా సినిమా ప్రపంచంలోనే బతికి.. ఫ్యామిలీకి కాస్త సమయం మాత్రమే కేటాయించిన ఓ హీరో ఇప్పుడు తన పూర్తి సమయం అంతా వాళ్లతోనే గడపాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే..?

బాలీవుడ్ మిస్టర్ పర్​ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను తాత్కాలికంగా సినిమాలు మానేస్తున్నట్లు ప్రకటించారు. ఆమిర్ ప్రకటనతో ఒక్కసారిగా బాలీవుడ్ షాక్ అయింది. ఉన్నట్టుండి ఆమిర్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం గాక తలలు పగులగొట్టుకుంటున్నారు. లాల్​సింగ్ చడ్డా సినిమా వైఫల్యం ఆమిర్​ని కుంగదీసిందా అని ఆలోచిస్తున్నారు. అసలు ఆమిర్​కు ఏమైంది..? ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? తన మాటల్లోనే తెలుసుకుందాం.

- Advertisement -

 

నెరిసిన గడ్డం, తెల్లజుట్టుతో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆమిర్‌ ఖాన్‌. లాల్‌సింగ్‌ చడ్డా ఫెయిల్యూర్‌ తర్వాత తొలిసారి ఓ ఈవెంట్‌లో ప్రత్యక్షమయ్యారాయన. తన చిన్ననాటి స్నేహితులు నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. “ఒక నటుడిగా ఏదో కోల్పోయాను అన్న ఫీలింగ్‌ వస్తోంది. నిజానికి లాల్‌సింగ్‌ చడ్డా తర్వాత ఛాంపియన్స్‌ మూవీ చేయాల్సి ఉంది. ఇది ఓ అద్భుతమైన కథ. కానీ ఆ సినిమా చేయాలని లేదు. ముందు నాకు విశ్రాంతి కావాలనిపిస్తోంది. నా తల్లితో, పిల్లలతో, కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలనుంది. 35 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నా. నిరంతరం పని గురించే ఆలోచించాను. కానీ అది కరెక్ట్‌ కాదనిపిస్తోంది. నాకు దగ్గరైన మనుషుల గురించి కూడా ఆలోచించాల్సింది. వారితో కలిసి జీవితాన్ని మరో యాంగిల్‌లో చూసేందుకు ఇదే సరైన సమయం అనిపిస్తోంది. కాబట్టి మరో ఏడాదిన్నరదాకా నటుడిగా కెమెరా ముందుకు వెళ్లే ప్రసక్తే లేదు” అని తేల్చి చెప్పారు ఆమిర్‌ ఖాన్​.

‘మరి ఛాంపియన్స్‌ సినిమా సంగతి ఏంటంటారు?’ అన్న ప్రశ్నకు ఆమిర్‌ స్పందిస్తూ.. “నిర్మాతగా నేను నా పనులు నిర్వర్తిస్తూనే ఉంటాను. కాబట్టి నటుడిగా కాకపోయినా ఛాంపియన్స్‌కు నేను నిర్మాతగా ఉంటాను. వేరే యాక్టర్‌ను లీడ్‌ రోల్‌ చేయమంటాను. అంతా సవ్యంగానే జరుగుతుందని భావిస్తున్నా. ప్రస్తుతానికైతే నేను నా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేయాలి” అని చెప్పుకొచ్చారు.

భారీ అంచనాలతో తెరకెక్కిన ఆమిర్ ఖాన్ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ బాక్సాఫీస్ వద్ద బోర్లాపడింది. ఈ సినిమా నష్టాన్ని తగ్గించడానికి ఆమిర్ తన పారితోషికాన్ని కూడా వదులుకున్నారు. ‘లాల్‌ సింగ్ చడ్డా’ మొత్తం బడ్జెట్‌ రూ.180 కోట్లు కాగా ఆమిర్‌, అతడి మాజీ భార్య కిరణ్‌రావ్‌ ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా కోసం గత నాలుగేళ్లుగా వేరే ఏ చిత్రాన్నీ ఆమిర్‌ అంగీకరించలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here