చరిత్రను తిరగరాసినట్లుంది.. పాత రోజులు గుర్తొస్తున్నాయన్న చిరంజీవి

- Advertisement -

‘ఒకప్పుడు.. సినిమాలు 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు ఆడేవి. ఇప్పుడు.. రెండు వారాలు ఆడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు ప్రదర్శితమవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి . ఈయన, రవితేజ ప్రధాన పాత్రల్లో దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. పలు థియేటర్లలో ఈ చిత్రం 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ఓ వేడుక నిర్వహించింది.

చిరంజీవి
చిరంజీవి

వేడుకనుద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘అత్యధిక రోజులు సినిమా ప్రదర్శితమై, విజయానికి గుర్తుగా షీల్డు అందుకున్నందుకు ఒళ్లు పులకరిస్తోంది. చరిత్రను మళ్లీ తిరగరాసినట్టు అనిపిస్తోంది’’ అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రవితేజ, దర్శకులు బాబీ, హరీశ్‌ శంకర్‌, బుచ్చిబాబు, గోపీచంద్‌ మలినేని, నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంలో ఆయన ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు చెబుతున్నారు. ఈ సందర్భంగా మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

కృష్ణ జిల్లా ప్రాంతం లో మెగాస్టార్ చిరంజీవి కి ఎవ్వరూ ఊహించని క్రేజ్ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత ఆయన 5 సినిమాలు చేస్తే అందులో మూడు సినిమాలు టాప్ 5 లో ఉంటాయి. అది ఆయన రేంజ్, ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కూడా కృష్ణ లోని అవనిగడ్డ ప్రాంతం లో 200 రోజులు పూర్తి చేసుకుంది. అక్కడ రామకృష్ణ థియేటర్ లో జనవరి 13 వ తారీఖు నుండి నేటి వరకు నాలుగు ఆటలతో రామకృష్ణ థియేటర్ లో 150 రోజులు పూర్తి చేసుకుంది. ఓటీటీ కాలం లో ఒక సినిమా 200 రోజులు పూర్తి చేసుకుంది అంటే సాధారణమైన విషయం కాదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here