Actress In Black : బ్లాక్​డ్రెస్​లో మెస్మరైజింగ్ లుక్స్​తో కట్టిపడేస్తున్న బ్యూటీస్​



Actress In Black : అందమైన ముద్దుగుమ్మల ఫొటోలతో సోషల్ మీడియా కలర్​ఫుల్​గా మారింది. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీస్ హాటు పోజులతో ఇంటర్నెంట్ హీట్ ఎక్కింది. తాజాగా బాలీవుడ్ భామలు నుష్రత్ బరూచా, మాజీ మిస్ ఇండియా మానుషీ చిల్లర్, మలయాళ కుట్టి ఐశ్వర్య లక్ష్మీ, టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బ్లాక్ డ్రెస్సులో కవ్విస్తున్నారు. ఓసారి వారి ఔట్​ఫిట్స్​పై ఓ లుక్కేద్దామా..!

Actress In Black
Actress In Black

 

బాలీవుడ్​ బ్యూటీ నుష్రత్ బరూచా బ్లాక్ ఔట్​ఫిట్​లో మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కార్తీక ఆర్యన్ వంటి యంగ్ హీరోలతో పని చేస్తూనే.. అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేస్తోంది ఈ బ్యూటీ. రీసెంట్​గా ఈ బ్యూటీ నటించిన రామసేతు సినిమా థియేటర్​లో విడుదలై మిక్స్​డ్ టాక్ సొంతం చేసుకుంది.

Manushi Chiller in BLack

మాజీ మిస్ ఇండియా మానుషీ చిల్లర్. ఈ బ్యూటీ బాలీవుడ్​లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన సామ్రాట్ పృథ్వీరాజ్​ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. రీసెంట్​గా టాలీవుడ్​లో మెగా ప్రిన్స్ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసినట్లు టాక్. ఇక ఈ బ్యూటీ తరచూ తన స్టైలిష్ లుక్స్​తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది.

Tamannah In Black

తమన్నా భాటియా.. టాలీవుడ్​లో శ్రీ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ మిల్కీ బ్యూటీ స్టార్ హీరోయిన్​ రేంజ్​కు వెళ్లింది. ఇప్పుడు ఎక్కువ అవకాశాలు లేక బాలీవుడ్​కు మకాం మార్చింది. ఇటీవలే బీ టౌన్​లో బంటీ అరౌ బబ్లీ, ప్లాన్ ఏ ప్లాన్ బీలతో ముంబయి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Aishwarya Lakshmi

ఐశ్వర్య లక్ష్మీ.. ఈ మలయాళ కుట్టి తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇటీవలే పాన్ ఇండియా సినిమా పొన్నియున్ సెల్వన్1లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ బ్యూటీ నటించిన అమ్ము అనే సినిమా ప్రతి మధ్యతరగతి మహిళను విపరీతంగా ఆకట్టుకుంది.