Tamannaah Photos : ఎర్రగౌనులో మిల్కీబ్యూటీ పరువాలు చూడతరమా..!

- Advertisement -

Tamannaah Photos  .. ఈ భామను టాలీవుడ్ ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుుకుంటుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్ధ కాలం దాటినా ఈ బ్యూటీ అందం చెక్కుచెదరలేదు. ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్.. మరోవైపు బాలీవుడ్​లలో తన సత్తా చాటుతోంది. టాలీవుడ్​లో ఒకప్పుడు ఫుల్ జోష్​తో ఒక ఊపు ఊపేసింది. యువ హీరోయిన్లు రంగంలోకి దిగడంతో తమన్నా కాస్త వెనకబడింది.

 

Tamannaah Photos
Tamannaah Photos

టాలీవుడ్​లో తమన్నాకు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్​లో తెలుగు ప్రేక్షకులకు దూరమవ్వకుండా సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటోంది. తనకు సంబంధించిన అప్డేట్స్​ని పంచుకుంటూ ఫ్యాన్స్​ని ఖుష్ చేస్తోంది. తాజాగా తమన్నా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. రెడ్ కలర్ డ్రెస్​లో ట్యామీ అందాలు అదరహో అనిపించేలా ఉన్నాయి.

- Advertisement -

 

ఎరుపు రంగు గౌనులో అచ్చం యువరాణిలా కనువిందు చేస్తోంది తమన్నా. తన ఘాటు పోజులతో కుర్రాళ్లుక కైపెక్కించేస్తోంది. హాట్ హాట్ పోజులతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ట్యామీ ఫొటోలు చూసిన యువకులు ఆమెపై మనసు పారేసుకుంటున్నారు.

 

టాలీవుడ్​కు కాస్త గ్యాప్ ఇచ్చిన తమన్నా ప్రస్తుతం తన మకాం బాలీవుడ్​కు మార్చేసింది. బీ టౌన్​లో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బబ్లీ బౌన్సర్​తో బాలీవుడ్​లో తన ఫస్ట్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు ముందు అడపాదడపా మూవీస్ చేసినా వాటికి ఏ మాత్రం గుర్తింపు రాలేదు. కానీ బబ్లీ హౌన్సర్​తో ఒక్కసారిగా తమన్నా కెరీర్ సూపర్ ఫాస్ట్​గా బౌన్స్ అయిందని బీటౌన్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ మూవీ తర్వాత ప్లాన్ ఏ ప్లాన్ బీ అనే మూవీతో రితేశ్ దేశ్​ముఖ్ సరసన నటించింది. ఈ సినిమా నెట్​ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయి మిక్స్​డ్ టాక్ సంపాదించుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here