Manushi Chhillar : బిజినెస్​మ్యాన్​తో బాలీవుడ్ బ్యూటీ ప్రేమాయణం..!

- Advertisement -

మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ ఓ బిజినెస్​మ్యాన్​తో ప్రేమలో పడిందనే వార్తలు బీ టౌన్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీళ్లిద్దరూ కలిసి వెకేషన్లు, పార్టీలు, డేట్స్​కి కలిసి వెళ్తున్నట్లు.. బాలీవుడ్ మీడియాతో పాటు బీ టౌన్ ఇండస్ట్రీ మాట్లాడుకుంటోంది. తాజాగా Manushi Chhillar రిలేషన్​షిప్ గురించి కాస్త క్లారిటీ వచ్చిందని ముంబయి మీడియా కోడై కూస్తోంది.

Manushi Chhillar
Manushi Chhillar

మానుషీ చిల్లర్​ ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ కామత్ ప్రేమలో ఉందట. అయితే నిఖిల్​కు గతంలోనే వివాహమైందట. 2019 లో పెళ్లి చేసుకున్న నిఖిల్ కామత్ గతేడాది తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. అయితే మానుషి చిల్లర్​తో నిఖిల్ ప్రేమ.. భార్యకు అతడు విడాకులు ఇవ్వక ముందు నుంచే మొదలైందా లేదా విడాకుల తర్వాత వీరిద్దరు ప్రేమలో పడ్డారా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. కానీ వీళ్లిద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని.. ప్రేమలో ఉన్నారనే క్లారిటీ మాత్రం వచ్చేసిందని బాలీవుడ్ మీడియా కథనాలు రాసేస్తోంది.

నిఖిల్, మానుషిలు తరచూ విదేశీ పర్యటనలు, హాలీడే ట్రిప్స్​కు కలిసి వెళ్లడంతో వీరిద్దరి ప్రేమాయణం బయటపడింది. తరచూ ఎయిర్​పోర్టులలో కలిసి కనిపించడంతో మీడియా కంట పడ్డారు. వీరి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్లిందని.. అతి త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. పెళ్లి గురించి మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

- Advertisement -

కానీ.. మానుషి చిల్లర్, నిఖిల్ కామత్​ల ప్రేమ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలుసట. అంతే కాకుండా వారిద్దరి ప్రేమకు, పెళ్లికి ఇరు కుటుంబాల ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాయట. త్వరలోనే ఇద్దరూ ఒకటికానున్నట్లు బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది. కానీ మానుషి ఇప్పుడే బాలీవుడ్​లో తన కెరీర్ స్టార్ట్ చేసిందని.. ఈ టైంలో పెళ్లి చేసుకుంటే తనకు అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మరి ఈ బ్యూటీ తెలివిగా ఆలోచించి ముందు కెరీర్ ప్లాన్ చేసుకుంటుందో లేక పెళ్లి చేసుకుంటుందో చూడాలి. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా బాలీవుడ్​లో సినిమాలు చేస్తుందా లేదోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మానుషి వివాహం తర్వాత కూడా తన కెరీర్​లో రాణించాలని కోరుకుంటున్నారు.

మిస్ వరల్డ్​గా గుర్తింపు దక్కించుకున్న మానుషి చిల్లర్ ప్రేమను దక్కించుకున్న నిఖిల్ అదృష్టవంతుడు అంటూ ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. వందల కోట్ల ఆస్తిపరుడు అయిన నిఖిల్ కామత్​తో ప్రేమ పెళ్లి మానుషి అదృష్టం అంటున్నారు.

2017లో ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషీ బాలీవుడ్​లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన అందంతో పాటు నటనలో కూడా టాలెంట్ చూపించి ఆడియన్స్​ను ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్​లోనే గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ, టెహ్రాన్‌ అనే రెండు సినిమాల్లో నటిస్తోంది మానుషీ. ఈ రెండు సినిమాలతో పాటు బీ టౌన్​లో మరి కొన్ని ఆఫర్లు ఆమె తలుపు తట్టినట్లు సమాచారం. వాటికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక మానుషీ కూడా బాలీవుడ్​లో బిజీ అయినట్టేనని బీ టౌన్ టాక్.

 

మానుషీ త్వరలోనే తెలుగు తెరపై సందడి చేయబోతోంది. మెగా హీరోతో ఈ బ్యూటీ జత కట్టబోతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించనున్న సినిమాలో హీరోయిన్​గా మానుషీ చిల్లర్​ను తీసుకున్నట్టు టాలీవుడ్ సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here