Rashmika Mandanna : ఆ ఇండస్ట్రీలో రష్మిక మందన్న బ్యాన్.. ఆ సినిమాయే కారణమా..?కన్నడ ఇండస్ట్రీలో కిరిక్ పార్టీ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఆ తర్వాత టాలీవుడ్​లో యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి చలో మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. క్యూట్ బిహేవియర్​తో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్​ని క్రియేట్ చేసుకుంది. గీతాగోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. ఇక పుష్ప మూవీతో Rashmika Mandanna పాన్ ఇండియా స్టార్ అయిపోయింది.

పాన్ ఇండియాలో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్న కు బాలీవుడ్ రెడ్ కార్పెట్ ఏసి మరీ వెల్​కమ్ చెప్పింది. అక్కడ వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది రష్మిక ఇటీవలే బాలీవుడ్​లో గుడ్​బై అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే బిగ్​బీ అమితాబచ్చన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ సక్సెస్ జోష్​లో ఉన్న రష్మికకు రణ్​బీర్ కపూర్​ ఎనిమల్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది. ఇదే కాకుండా సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్నులో అవకాశం కొట్టేసింది ఈ కన్నడ బ్యూటీ. ఇవే కాకుండా తమిళ్​లోనూ వరుస సినిమాలు చేస్తోంది రష్మిక. రీసెంట్​క ఇళయదళపతి విజయ్​తో కలిసి వారిసు మూవీలో అవకాశం దక్కించుకుంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

టాలీవుడ్ హ్యాండ్సమ్​ హంక్ విజయ్​దేవరకొండతో కలిసి రష్మిక మందన్న రిలేషన్​షిప్​లో ఉందంటూ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ కోడై కూస్తోంది. విజయ్ ఇంటికి రష్మిక రావడం.. ఇద్దరూ కలిసి వెకేషన్స్​కు వెళ్లడం వంటి వాటితో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ జంట తమ రిలేషన్​షిప్ గురించి వస్తోన్న వార్తలపై స్పందించలేదు.

ఇలా ఫుల్​ఫామ్​లో దూసుకెళ్తున్న రష్మికను కన్నడ ఇండస్ట్రీలో బ్యాన్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. కన్నడ ప్రేక్షకులు ఈ క్యూటీపై చాలా కోపంగా ఉన్నారని ట్రోల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. మరి వారి కోపానికి కారణమేంటంటే.. ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు. ఇంతకీ రష్మిక ఏం మాట్లాడిందంటే..?

కర్ణాటకలో పుట్టి కన్నడలో మొదటి హిట్‌ అందుకున్న రష్మిక తన సొంత ఇండస్ట్రీని చులకన చేసిందంటూ నెట్టింట తెగ ట్రోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు ‘కాంతార’ మూవీ కారణం. ఈ చిన్న సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. ఇంతవరకూ ఈ సినిమా చూడనేలేదని, అంత టైం లేదని చెప్పిందీ నేషనల్‌ క్రష్‌. ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా గురించి చెప్పేటప్పుడు సోకాల్డ్‌ బ్యానర్‌లో చేశానంటూ నిర్మాణ సంస్థ పేర్లు కూడా ప్రస్తావించలేదు. ఇది కన్నడిగులకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్‌ సినిమా బ్యానర్‌ కూడా తెలీదా? సో కాల్డ్‌ బ్యానర్‌ అని యాక్ట్‌ చేసి చెప్పడం ఎందుకు? అంత యాటిట్యూడ్‌ అవసరమా? అంటూ కన్నడిగులు మండిపడ్డారు.

అటు రిషబ్‌ శెట్టి కూడా రష్మికపై పరోక్షంగా కామెంట్స్‌ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో కన్నడ ఇండస్ట్రీలో రష్మికను బ్యాన్‌ చేయనున్నారంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బ్యాన్‌ చేసేంత తప్పు రష్మిక ఏం చేయలేదని వెనకేసుకొస్తున్నారు ఆమె అభిమానులు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ కన్నడిగులు ఆమె మీద ఆగ్రహంతో ఊగిపోతున్న మాట వాస్తవమనే తెలుస్తోంది.