Walthair Veeraya : మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత హిట్ ప్లాపుల తో పని లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు..ఇటీవల గాడ్ ఫాదర్ సినిమా తో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు..ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్నారు..మాస్ లుక్స్ తో అందరినీ కట్టిపడేస్తూ వాల్తేరు వీరయ్య సినిమాతో మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా విడుదలకి మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న టైం లో ఇప్పటికే చాలామంది అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ప్రతి ఒక్కరిలో టెన్షన్ పెరుగుతుంది.
అయితే అలాంటి నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయితే చిరంజీవి మొదట చేసే పని అదేనంటూ నెట్టింట్లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.చిరంజీవి శృతిహాసన్ జోడిగా రాబోతున్న తాజా సినిమా వాల్తేరు వీరయ్య ఈ సినిమా థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. ఈ సినిమాకి బాబి దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఇక తాజాగా ఈ సినిమా హిట్ అయితే చిరంజీవి ఓ పని చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి..
అదేంటంటే..హిట్ అయితే ముందు తన రెండు సినిమాలకు సంబంధించిన సినిమా షూటింగ్స్ ని వెంట వెంటనే చేస్తారట. ఇక ఇప్పటికే భోళా శంకర్ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయితే మరో రెండు ప్రాజెక్టులకు చిరంజీవి సైన్ చేసి ఆ రెండు సినిమాలను కూడా ఈ ఏడాది పూర్తి చేసి ఇక ఈ ఏడాది మొత్తంగా మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలుస్తుంది..మెగా ఫ్యాన్స్ అయితే సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు..మరి మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి..