Vithika sheru : వితిక షేరు.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమించి పెళ్లి చేస్తుంది.. అంతకన్నా ముందే ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటనా జీవితాన్ని ప్రారంభించింది.. ఇక వరుణ్ సందేశ్ తో కలిసి ఓ సినిమా కూడా చేసింది.. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.. అలా పెళ్లి చేసుకున్నారు.. పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ యూట్యూబ్ లో మాత్రం కనిపిస్తుంది.. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తుందనే వార్త ఒకటి వినిపిస్తుంది..,

2008లో ఓ కన్నడ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లే. ప్రేమించే రోజుల్లో
మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. కానీ, ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. పైగా తెలుగమ్మాయి అన్న కారణంతో వితికకు హీరోయిన్ గా ఆఫర్లు కూడా పెద్దగా రాలేదు. దాంతో యాంకర్ గా మారి.. సక్సెస్ అయింది. ఇక వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకొని ఇప్పుడు ఫ్యామిలి లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది..
2019లో బిగ్ బాస్ సీజన్ 3లో ఈ జంట కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. టైటిల్ గెలుచుకోలేకపోయినా.. తమదైన ఆటతీరులో తెలుగు రాష్ట్రాల్లో తమకంటూ మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. బిగ్ బాస్ తర్వాత వితిక బులితెర ఈవెంట్స్ లో సందడి చేస్తూనే.. మరోవైపు యూట్యూబ్ లో సొంతంగా ఛానెల్ ను ప్రారంభించింది..త్వరగానే క్లిక్ అయ్యింది..ఆరున్నర లక్షల సబ్‌స్క్రైబర్లు వితికా యూట్యూబ్ ఛానెల్ ను ఫాలో అవుతున్నారు. ప్రతి శుక్రవారం ఈ బ్యూటీ ఒక వీడియోను విడుదల చేస్తుంటుంది. వితిక ఇప్పటివరకు దాదాపు 160 వీడియోను పోస్ట్ చేసింది. ప్రతి వీడియోకు లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. ఇక వితిక షేరు యూట్యూబ్ ద్వారా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వితిక నెలకు దాదాపు రూ. 5 నుంచి 6 లక్షల వరకు సంపాదిస్తుందట.. ఈ విషయాన్ని వరుణ్ సందేశ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు..