Veerasimha Reddy : నందమూరి నట సింహం బాలయ్య బాబు మల్టీ టాలెంటెడ్ అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు..ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది..ఒకవైపు షోలు,మరోవైపు సినిమాలు, రాజకీయాలు ఇలా సమంగా బ్యాలెన్స్ చెయ్యడం ఆయన ఒక్కడికే సాధ్య అనే చెప్పాలి..ఇటీవల ‘అఖండ’ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ సినిమా తో గతంలో ఎప్పుడూ లేని విధంగా 200 కోట్ల రూపాయలను వసూల్ చేసి బాక్సాఫిస్ ను షేక్ చేశారు.. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినెని డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు.. ఆ సినిమానే వీర సింహారెడ్డి..
ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తీ అయ్యాయి. ఇక విడుదలకు డేట్ కూడా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్..వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన పోస్టర్లు ఆయన పాత్రల గురించి రివిల్ చేస్తున్నాయని తెలుసు.. ఇప్పటివరకు ఈ సినిమా లో రెండు పాత్రలు మాత్రమే అనుకున్నాము కానీ ఇప్పుడు మూడో పాత్ర కూడా వున్నట్లు టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది..ఇకపోతే ఇప్పటికే రిలీజ్ అయిన జై బాలయ్య జై జై బాలయ్య సాంగ్ తో పాటు, రొమాంటిక్ సాంగ్ సుగుణసుందరి సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసేస్తున్నాయి..
మంచి వ్యుస్ తో దూసుకుపోతున్నాయి. ఈ రెండు పాటలకు భారీ రెస్పాన్స్ రావడంతో వీరసింహారెడ్డికి ప్రి రిలీజ్ కూడా మంచి టాక్ ను అందుకుంటుందని తెలుస్తుంది.. ఇక ఈ సినిమా గురించి అదిరిపోయే ఓ షాకింగ్ ట్విస్ట్ బయటికి వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలు చేస్తున్నారని అందరికి తెలుసు… అందులో ఒకటి రాయలసీమలో ఉండే వీర సింహారెడ్డి పాత్ర అయితే. మరొకటి అమెరికా నుంచి వచ్చే బాలసింహారెడ్డి పాత్ర అని తెలుస్తుంది. అయితే తాజాగా మరో వార్త కోడ్తె కూస్తుంది.. బాలయ్య మూడు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఫ్యాన్స్ కు త్రిపుల్ ధమాకా అన్నమాట..
నందమూరి ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ మూడు పాత్రలలో ఒకటి గ్రామ పెద్దగా కనిపించగా, రెండోది మోడరన్ గా కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ మూడో పాత్రను మూవీ మేకర్స్ సస్పెన్స్ గా ఉంచినట్టు తెలుస్తోంది. అది సినిమా చూస్తున్నప్పుడు మాత్రమే రివీల్ అయ్యేలా సీక్రెట్‌గా ఉంచుతున్నారట.. అయితే ఈ వార్తతో ఫ్యాన్స్ లో మరింత జోష్ పెరిగిందని తెలుస్తుంది.. రకరకాల వార్తలు కూడా వస్తున్నాయి.. ఏది ఏమైనా ఈ సస్పెన్ క్లియర్ అవ్వాలంటే మాత్రం సంక్రాంతి వరకూ ఆగాల్సిందే మరి..