Trivikram : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో.. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబీ 28. సూపర్ స్టార్ మహేష్ బాబు.. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతుంది… ఇందులో యువ కథానాయికగా శ్రీలీల కీలకపాత్రలో కనిపించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనింగ్ గా రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది.. కాగా, ఈ సినిమా సెట్లో డైరెక్టర్ త్రివిక్రమ్ సరదాగా క్రికెట్ ఆడిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇప్పటికే ఈ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట తెగ వైరలయ్యాయి. తాజాగా మహేష్ మూవీ సెట్స్ నుంచి ఓ ఆసక్తికర వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. సినిమా షూటింగ్ బ్రేక్ టైమ్లో సరదాగా ఇతర టీమ్ మెంబర్స్ తో కలిసి క్రికెట్ ఆడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
కాగా ఈ వీడియోలో రంగస్థలం మహేష్ ను కూడా చూడవచ్చు.మొత్తం అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఈ మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు నటిస్తోన్న ఈ కోసం ఇప్పటికే ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ తర్వాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారు. పారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే జక్కన్న ప్రకటించడంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.. త్రివిక్రమ్ క్రికెట్ వీడియోను ఒకసారి చూడండి..