Tamannaah : సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన మిల్క్ బ్యూటీ తమన్నా గురించి అందరికీ తెలుసు.. శ్రీ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతోనే అందరికీ దగ్గరయింది. ఇక ఈ సినిమాతో తమన్నా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయి తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా తమన్నా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం దాటింది.అయినప్పటికీ కూడా తమన్నాకి అవకాశాలు వస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది.
ఇక ఈ మధ్యకాలంలో Tamannaah పెళ్లికి సంబంధించి ఎన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి..కొన్ని సందర్భాలు తమ్ముకు విసుగు కూడా తెప్పించాయి.ఇక న్యూయర్ సందర్భంగా గోవాలో జరిగిన పార్టీలో హగ్గులు, ముద్దులు ఇస్తూ ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తమన్నా, విజయ్ వర్మ ఇద్దరు ప్రేమలో ఉన్నారని అందరూ కన్ఫామ్ చేశారు. అయితే ఈ విషయం గురించి ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు క్లారిటీ ఇవ్వక పోయినప్పటికీ వీళ్లిద్దరి మధ్య ప్రేమ నిజమే అని అందరూ భావిస్తున్నారు..
ఇక తాజాగా మరో సారి ఈ జంట మీడియా కంట పడ్డారు.. ముంబైలో జరిగిన ఎల్లే అవార్డ్స్ ఫంక్షన్ లో తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి మీడియాకి చిక్కింది. ఇక స్టేజ్ పై వీరిద్దరూ చాలా సన్నిహితంగా మాట్లాడుకుంటూ కెమెరాకు ఫోజులిచ్చారు. ఇక వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూస్తుంటే నిజంగానే వీళ్ళు ప్రేమించుకుంటున్నారని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అలాగే వీరిద్దరూ ఈవెంట్ కి కలిసే వచ్చారని కూడా కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసాక చాలామంది నెటిజెన్స్ కొంపదీసి పెళ్లి చేసుకుందా అని కామెంట్లు చేస్తున్నారు..వీరిద్దరి మధ్య అది ఉందా లేదా అన్నది తెలియాంటే కొద్ది రోజుల ఆగాల్సిందే మరీ..