Sri Sathya : హౌస్లో శ్రీసత్య అందుకే పనికొస్తుందా?.. వీడియోతో బయటపడ్డ నిజాలు..

- Advertisement -

Sri Sathya : తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 6 జరుపుకుంటుంది…ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే..ఇప్పుడు అంతా ఊహించని ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ సీజన్ లో మొదటి నుంచే ఎలిమినేషన్స్ షాకింగ్ గా మారాయి. టైటిల్ ఫెవరెట్ గా నిలిచినవాళ్లు, టాప్ 5 కంటెస్టెంట్స్ ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అవుతూ అందరికీ షాక్ ఇస్తున్నారు..ప్రేక్షకుల అంచనాలు తారుమారు అయ్యాయి..ఇప్పటికీ అదే విధంగా హౌస్ లో ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి.

Sri Sathya

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బ్యూటిఫుల్ శ్రీసత్య ఎలిమినేట్ అయింది. దీంతో హౌజ్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. శ్రీసత్య ఎలిమినేషన్ తో శ్రీహాన్, రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యారు. కాగా తాజాగా బీబీ కేఫ్ కు హాజరైన శ్రీసత్యను యాంకర్ శివ ఇంటర్వ్యూ చేశాడు..ఆ ఇంటర్వ్యూ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

15 వారాల జర్నీ గురించి ఆమె వివరించింది..బయట నా మైండ్ సెట్ వేరేలా ఉండింది. అదే మైండ్ సెట్ పెట్టుకుని హౌజ్ లోకి వెళ్లాను. కానీ, నాకు తెలీకుండానే నేను మారిపోయా అని శ్రీసత్య తెలిపింది. నీ కెప్టెన్సీ.. గుడ్ కెప్టెన్సీ చేశానని అనుకుంటున్నావా శివ అడిగితే అవును అని సమాధానం ఇచ్చింది శ్రీసత్య.ఆ తర్వాత కొంత ఇంటర్వ్యూ వేడిగా మారింది.. శ్రీహాన్ ఈ మధ్య మారిపోయాడని చెప్పి అని శివ అంటే.. నువ్ చేంజ్ అవ్వు కాదనట్లేదు..అయితే, సడెన్ గా ఫ్లిప్ అయ్యావ్ అని శ్రీసత్య అంది.దానికి వెంటనే ఫ్లిప్పింగ్ ల గురించి నువ్ మాట్లాడుతున్నావా సత్య అని శ్రీసత్యకు యాంకర్ శివ అదిరిపోయే పంచ్ వేశాడు..

- Advertisement -

బిగ్ బాస్ హౌస్ లో రేవంత్, శ్రీహాన్ తప్పా మిగతా వాళ్లు ఎవరు అని శివ అంటుంటే.. అందరితో మాట్లాడాను.. కానీ వీళ్లిద్దరితో కొంచెం క్లోజ్ అని శ్రీసత్య చెప్పింది..ఇది ఇలా వుండగా..ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గురించి చర్చించారు.. అర్జున్ కల్యాణ్ పై నీ ఒపినీయన్ ఏంటీ అని శివ అడిగితే.. గుడ్ డీసెంట్ బాయ్ అని శ్రీసత్య చెప్పింది. అర్జున్ కల్యాణ్ కు నీపైన ఏం ఒపినీయన్ ఉండి ఉంటుందని అనుకుంటున్నావ్ అని మరో ప్రశ్న వేశాడు శివ… ఆ తర్వాత వాసంతి, అర్జున్ కళ్యాణ్ కలిసి శ్రీసత్య ఒక కంటెంట్ మాత్రమే..టైం పాస్ అన్నారని చెప్పి శివ షాక్ ఇచ్చాడు..మొత్తానికి ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here