sri sathya : హీరోయిన్ అయ్యేందుకు అన్నీ విధాలుగా అర్హతలు ఉన్నప్పటికీ కూడా, సినీ ఇండస్ట్రీ లో జరిగే రాజకీయాలవల్ల కొంతమంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణించలేకపోతున్నారు. అలాంటి వారిలో ఒకరు శ్రీ సత్య. ఈమె సోషల్ మీడియా ఆడియన్స్ కి, అలాగే బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన అమ్మాయి. సీరియల్స్ లో లేడీ విలన్ గా బాగా రాణించింది. చూసేందుకు ఎంతో అందంగా ఉన్నప్పటికీ కూడా కేవలం తెలుగు అమ్మాయి అవ్వడం వల్లే హీరోయిన్ పాత్రలు సీరియల్స్ లో ఇవ్వడంలేదని శ్రీ సత్య పలు ఇంటర్వూస్ లో బహిరంగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సీరియల్స్ ద్వారా వచ్చిన ఆ ఫేమ్ తో ఈమెకి బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది.
సీజన్ 6 లో టాప్ 6 కంటెస్టెంట్ గా నిల్చి ప్రేక్షకులకు మరింత దగ్గరైన శ్రీ సత్య కి ఈ షో తర్వాత సినిమా అవకాశాలు భారీగా వస్తాయని అందరూ భావించారు. అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అవి పెద్దగా ఆమెకి పేరు ప్రఖ్యాతలు తీసుకొని రాలేదు. కానీ డీజే టిల్లు మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ చిత్రం లో శ్రీ సత్య కి మంచి పాత్ర దొరికింది. ఈ చిత్రం తో ఆమె పెద్ద రేంజ్ కి వెళ్తుందని ఆశపడింది. అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమా ఆఫర్ గురించి మాట్లాడుతూ , తనకి ఎంతో మంచి పాత్ర ఈ చిత్రంలో దక్కిందని, కానీ సినిమా ఫైనల్ ఎడిటింగ్ చూసిన తర్వాత ఎందుకో నా సన్నివేశాలు కథకి అడ్డంగా ఉన్నట్టు దర్శకుడికి అనిపించి సన్నివేశాలు తొలగించారని చెప్పుకొచ్చింది.
కానీ రెమ్యూనరేషన్ మాత్రం చెప్పిన టైం కి చెప్పినట్టు ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చింది. టిల్లు స్క్వేర్ చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, ఈ సినిమా తర్వాత నా రేంజ్ మరో లెవెల్ కి వీల్లేదని, కానీ ఎక్కడ మొదలయ్యానో,అక్కడే ఉండిపోయాను అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది శ్రీ సత్య. చాలా సినిమాల్లో సీరియల్ నటి అని కారణం చేత నన్ను తొలగించారని, మళ్ళీ నా స్థానం లో టీవీ సీరియల్ నటినే పెట్టుకున్నారని చెప్పుకొచ్చింది. ఒక సినిమాలో అయితే నేను హీరోయిన్ ని డామినేట్ చేసేంత కలర్ ఉన్నానని తీసేసారు అంటూ శ్రీ సత్య ఈ సందర్భంగా తన అనుభవాలను చెప్పుకొచ్చింది.