పెళ్లి సందడి చిత్రంతో 2021 టాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రీ లీల ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆల్రెడీ లైన్ లో ఉన్న టాప్ మోస్ట్ బ్యూటీలను పక్కనపెట్టి ఏకంగా 8 సినిమాలను చేతిలో పట్టుకొని ఉంది. అగ్ర హీరోల సరసన నటిస్తూ తెగ బిజీగా ఉన్న ఈ బ్యూటీ సంపాదన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మెడిసిన్ చదువుతూ మోడలింగ్ పై ఇంట్రెస్ట్ కనబరిచిన శ్రీ లీల కన్నడ మూవీ తో హీరోయిన్ గా పరిచయమైంది. దీనికి తోడు ఆమెకు డాన్స్ లో కూడా ప్రావీణ్యం ఉండడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే టాలీవుడ్ లో మాత్రం రవితేజ కాంబినేషన్లో వచ్చిన ధమాకా చిత్రంతో ఫస్ట్ హిట్ అందుకుంది.
ధమాకా తెచ్చిన ఫేమ్ తో ఇప్పుడు వరుసగా స్టార్ హీరోల సరసన మంచి ఆఫర్స్ సంపాదించింది. మహేష్ బాబు గుంటూరు కారం దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వరకు ఎక్కడ చూసినా శ్రీలీల కనిపిస్తోంది. వీటితోపాటు ప్రస్తుతం నితిన్ మరియు వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న చిత్రం నుంచి రష్మిక సైడ్ తొలగడంతో అందులో హీరోయిన్గా శ్రీలీల ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ లో ఒక కీలక పాత్రలో ఆమె నటిస్తోంది. వీటితోపాటుగా ఆదికేశవ ,స్కందా ,అనగనగా ఒక రోజు లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని చేతిలో ఉన్నాయి. ఇక క్రేజ్ పెరగడంతో ఈ బ్యూటీ సినిమాకి కోటి నుంచి కోటిన్నర వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.కేవలం 6 నెలల వ్యవధిలో సుమారు 15 కోట్ల వరకు శ్రీలీల సంపాదించినట్టు అంచనా. 22 సంవత్సరాల వయసు కూడా లేని ఒక హీరోయిన్ ఇంత తక్కువ వ్యవధిలో ఇంత పెద్ద మొత్తం సంపాదించడం రికార్డు అనే చెప్పవచ్చు.