శ్రీలీల జాతకం మరికొన్ని రోజుల్లో మారనుంది.. మొత్తం బయటపెట్టిన వేణుస్వామి

- Advertisement -

ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆయన సెలబ్రేటీల జాతకం చెబుతూ.. ఆయన కూడా ఓ సెలబ్రేటీ అయిపోయాడు. ముఖ్యంగా ఆయన చెబితే 99శాతం వాస్తవాలుగా ఉంటున్నాయి. గతంలో చెప్పిన ఆయన వీడియోలు ప్రస్తుత సంఘటనలకు కనెక్ట్ చేస్తూ.. ఆయన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అయితే తెలుగులో టాప్ హీరోయిన్ గా మారిన శ్రీలీల గురించి వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ సెన్సెషన్ యంగ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా శ్రీలీల మారిపోయింది.

శ్రీలీల
శ్రీలీల

చేసింది రెండు సినిమాలే అయినా చేతిలో మాత్రం వరుస సినిమాల ఆఫర్లతో దూసుకెళ్తోంది. యంగ్ హీరోల నుంచి స్టార్ కథానాయకుల వరకు అన్నీ చిత్రాల్లో శ్రీలీలకు ఛాన్స్ లు క్యూ కడుతున్నాయి. ‘పెళ్లిసందడి’తో ఎంట్రీ ఇచ్చి ‘ధమాకా’ సినిమాతో 100 కోట్ల హీరోయిన్ గా మారిన శ్రీలీల అప్పటినుంచి ఆమెకు అదృష్టం వెంట నడుస్తోంది. అయితే ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి.

సెలబ్రేటీల జాతకం చెబుతూ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. గతంలో నయనతార, సమంత నాగ చైతన్య వంటి ప్రముఖల జాతకాలు చెప్పి బాగా ఫేమస్ అయ్యాడు. అంతే కాదు నరేష్ జాతకం కూడా చెప్పుకొచ్చాడు. దాదాపు ఆయన చెప్పేవి 99శాతం వాస్తవాలుగా ఉంటున్నాయి. దీనితో ఆయనకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశాడు. దక్షిణ భారతదేశంలోనే శ్రీలీల టాప్ హీరోయిన్ గా కొనసాగుతుందని సంచనల వ్యాఖ్యలు చేశాడు.

- Advertisement -
Sreeleela

వేణుస్వామి శ్రీలీల గురించి మాట్లాడుతూ… ”శ్రీలీల జాతక రిత్యా మీన రాశి. ఈ జాతకాన్ని నేను విశ్లేషించాను. ఆమె జాతకంలో రాజ యోగం ఉంది. విపరీతమైన పేరు, ప్రఖ్యాతలు, విపరీతమైన ఆదాయం, విపరీతమైన అవకాశాలు.. ఈమె జాతకంలో ఉంది. 2028వ సంవత్సరం వరకు శ్రీలీలదే హవా. ఈమెది చాలా గొప్ప జాతకం. నయనతార జాతకానికి దగ్గరగా ఉండే జాతకం. ఈమె ఎక్కువ కాలం హీరోయిన్ గా ఉంటుంది. అందరి హీరోయిన్ల స్థానాలను ఈమె అక్రమించేస్తుంది. పూజా హెగ్డే, సమంత, రష్మిక వీరి స్థానాలను ఈమె కైవసం చేసుకోనుంది. దాదాపు 6,7 సంవత్సరాల పాటు టాలీవుడ్ ఏలేది ఈమెనే. టాలీవుడ్ తో పాటు.. రెండు, మూడు సౌత్ భాషల్లో ఈమెనే నంబర్ వన్ గా ఉంటుంది. ఈమె జాతకానికి రాజయోగం ఉంది.” అని చెప్పుకొచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here