స్టార్ హీరోయిన్ Samantha Ruth Prabhu సమంత భావోద్వేగానికి గురయ్యారు. సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తన అనారోగ్యం గురించి కొందరు తప్పుగా ప్రచారం చేస్తూ తాను ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు వార్తలు రాశారని, కానీ తాను ఇప్పటికి ఇంకా చావలేదని ఎమోషనల్ అయ్యారు.చికిత్స తీసుకుంటూనే చేతికి సెలైన్ పెట్టుకొని యశోద డబ్బింగ్ పూర్తి చేసిన సమంత తాజాగా ప్రమోషన్స్‌లోనూ స్వయంగా పాల్గొన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
తను పడ్డ కష్టాలను గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకానొక సమయంలో తాను ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేనని అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే ఇక్కడివరకు ఎలా వచ్చానోనని అనిపిస్తుంది అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వచ్చిన వదంతులపై కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఇప్పటికి ఇంకా చావలేదని భావోద్వేగానికి గురయ్యారు.
తనలాగే ఎంతోమంది కష్టాలతో పోరాడుతున్నారని, తన సమస్య పెద్ద కాదని, ఈ పోరాటంలో కచ్చితంగా విజయం సాధిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు.సరోగసి నేపథ్యంలో సాగే ఉత్కంఠ భరిత కథనంలా యశోద చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. హరి, హరీష్ దర్శకులు. వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు. సమంత యశోద సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[…] జెస్సీ Samantha కెరీర్ లో సూపర్ స్పీడ్ గా […]