Beauty Anchors బుల్లితెర మీద హాట్ యాంకర్ గా దూసుకొచ్చిన విష్ణు ప్రియా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పోవే పోరా, జబర్దస్త్ వంటి పాపులర్ షోస్ తో పాటుగా ఎన్నో రియాలిటీ షోస్ కి యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజిని ఏర్పాటు చేసుకుంది. అంతే కాకుండా ఈ హాట్ యాంకర్ సోషల్ మీడియా లో కూడా బాగా పాపులర్ సెలబ్రిటీ గా పేరు తెచ్చుకుంది. ఇక సీరియల్స్ లో లేడీ విలన్ గా రాణిస్తూ, సోషల్ మీడియా లో టాప్ స్టార్ సెలబ్రిటీ గా పేరు తెచ్చుకున్న మరో నటి రీతూ చౌదరి. యూత్ ఆడియన్స్ లో ఈమెకి ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. ఈమె అప్లోడ్ చేసే ఫోటోలు, షోస్ లో ఆమె చేసే బోల్డ్ కామెంట్స్ కి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.
ఈ ఇద్దరూ రియల్ లైఫ్ లో చాలా మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తుంటారు. యూట్యూబ్ లో వీళ్లిద్దరు కలిసి చేసిన ట్రిప్స్ వీడియోస్ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి స్టార్ మా ఛానల్ లో రీసెంట్ గానే ప్రారంభమైన కిరాక్ బాయ్స్, కిలాడి లేడీస్ షోలో పాల్గొంటున్నారు. ఈ షో కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ షో కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ప్రోమో లో తన బాయ్ ఫ్రెండ్ ని ఉద్దేశించి రీతూ చౌదరి ఒక లవ్ లెటర్ రాసింది.
ఆ లెటర్ లో ‘నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను షాపింగ్ చెయ్యడం మానేస్తాను. ఎందుకంటే నువ్వు వేసుకునే బట్టలే నేను కూడా వేసుకుంటాను. నీకోసం నేను చేసిన కాఫీ తోనే నా రోజు మొదలవ్వాలి’ అని రాసి ఉంది. ఇది విన్న విష్ణు ప్రియా ‘మా వాడికి కాఫీ తాగే అలవాటు లేదని నీకు ఎలా తెలుసు’ అని అడగగా, నీతో ప్రేమలో పడేముందే నీ వాడు నాతో ప్రేమలో పడ్డాడు అని అంటుంది. దీంతో విష్ణు ప్రియా ఒక్కసారిగా షాక్ కి గురి అవుతుంది. నిజ జీవితం లో రీతూ వర్మ శ్రీకాంత్ అనే వ్యక్తి తో ప్రేమలో ఉంది. ఇతనితో కలిసి రీతూ వర్మ సోషల్ మీడియా లో ఎన్నో ఫోటోలు అప్లోడ్ చేసింది. ఈ ప్రోమో చూసిన తర్వాత నెటిజెన్స్ మీరిద్దరూ మాట్లాడుతుంది శ్రీకాంత్ గురించేనా అని వాళ్ళ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు.