Rakul Preet Singh : టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత ముంబయికే పరిమితమై పోయింది. ఏదైనా ఈవెంట్ ఉంటేనే హైదరాబాద్ వస్తోంది. ఇక తెలుగు సినిమాల్లో నటించకుండా తన పూర్తి ఫోకస్ బాలీవుడ్ పైనే పెట్టింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక తాజాగా రకుల్ అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ వేడుకకు హాజరైంది.
ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి చాలా మంది నటీనటులు హాజరయ్యారు. వారంతా ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో సందడి చేశారు. రకుల్ కూడా ఈ ఈవెంట్ కు ట్రెడిషనల్ గా శారీలో వెళ్లింది. సిల్వర్ కలర్ శారీలో రకుల్ రావిషింగ్ లుక్స్ అదిరిపోయాయి. చీరకట్టులో సంప్రదాయంగా కనిపిస్తూనే మరోవైపు వెస్టర్న్ వైబ్ యాడ్ చేసింది తన లుక్ కు. మెడలో డైమండ్ నెక్లెస్ తో సింపుల్ లుక్ లో గార్జియస్ గా కనిపించింది.
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ లుక్ లో రకుల్ ను చూసిన ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. శారీలో ఈ భామ అందం మామూలుగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత రకుల్ ను చూశామంటూ మిస్ యూ రకుల్ అంటూ ఎమోజీలతో ప్రేమనంతా కురిపించేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram