బ్యూటీ Rakul Preet సోషల్ మీడియాలో మరోసారి తన హవా చూపించింది. అయితే ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సులో మెరిసే రకుల్ ఈసారి ఎత్నిక్ వేర్‌ను సెలెక్ట్ చేసుకుంది. ఆరెంజ్ కలర్ శారీలో రకుల్ తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది.
తాజాగా శారీలో దిగిన ఫొటోలను రకుల్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టు చూసిన కుర్రాళ్లు రకుల్ అందానికి ఫిదా అవుతున్నారు. అతిలోక సుందరి.. అతిలోక సుందరి.. తొలిచూపుకే ఇలా మతిపోయెనే మరి అంటూ పాటలు కూడా పాడేసుకుంటున్నారు.
తాజాగా రకుల్ పోస్టు చేసిన ఫొటోల్లో ఈ బ్యూటీ ఆరెంజ్, మిల్కీ వైట్ కాంబినేషన్ కలిగిన డిజైనర్ శారీలో సూపర్ గ్లామరస్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోల్లో రకుల్ పోజులు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. ఎప్పుడూ ట్రెండీ వేర్లో సందడి చేసే రకుల్ ఈ ఫొటోల్లో నిండైన దుస్తుల్లో కూడా కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసే పోజులిచ్చింది. ట్రెడిషనల్ వేర్‌లోనూ తన లుక్స్‌తో రకుల్ కుర్రాళ్లను టెంప్ట్ చేసేస్తోంది. ప్రజెంట్ రకుల్ ఫొటోలతో సోషల్ మీడియా హీటెక్కిపోతోంది.
తన సోషల్ మీడియా ఖాతాలో రకుల్ శారీలో ఉన్న ఫొటోలు పోస్టు చేసింది. ఈ ఫొటోల కింద ఓ సూపర్ క్యాప్షన్ కూడా జోడించింది. స్ట్రాంగ్ విమెన్‌కి యాటిట్యూడ్ కాదు స్టాండర్డ్స్ ముఖ్యం అని క్యాప్షన్ పెట్టింది. ఇంటెన్స్ తో కూడిన రకుల్ క్యాప్షన్ తన ఫొటోలను మరింత ఎలివేట్ చేశాయి.
అందంలోనూ కాదు .. యాటిట్యూట్.. స్టాండర్డ్స్లోనూ రకుల్‌కు ఎవరూ సాటిరారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే రకుల్ లేటెస్ట్ మూవీ ఛత్రీవాలి జీ 5లో నేరుగా విడుదలైంది. బోల్డ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ దక్కింది.
వరుస పరాజయాల తర్వాత దక్కిన హిట్ కావడంతో రకుల్ సంతోషం వ్యక్తం చేస్తోంది. సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఛత్రీవాలి తెరకెక్కింది. రకుల్ ప్రీత్ కండోమ్ టెస్టర్ రోల్ పాత్రలో నటించింది.