Shriya Saran : మూడు పదుల వయస్సు దాటినా ఇంచు అందం కూడా తగ్గకుండా కుర్ర హీరోయిన్స్ తో పోటీ పడుతున్న హీరోయిన్స్ లో ఒకరు శ్రీయా శరన్.. సౌత్ లో ఈమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించేసింది..
పెళ్ళైన తర్వాత కూడా తన అందచందాలతో సోషల్ మీడియా లో అభిమానుల కోసం ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది.. లేటెస్ట్ గా ఆమె ఒక బట్టల దుకాణం లో అందాల ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.. ఆ ఫోటో ని మీరు కూడా క్రింద చూడవచ్చు.
పెళ్ళైన తర్వాత కూడా సోషల్ మీడియా లో ఇలాంటి ఫోటోలు ఎందుకు పెడుతున్నారు అంటూ కొంతమంది అభిమానులు నెగటివ్ కామెంట్స్ చేసినప్పటికీ, మరికొంత మంది ఇంత వయస్సు వచ్చిన తర్వాత కూడా అదే అందం మైంటైన్ చెయ్యడం ఆంటే సాధారణమైన విషయం కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు..ఇదంతా పక్కన పెడితే శ్రీయా శరన్ ఇప్పటికీ సౌత్ లో బిజీ ఆర్టిస్టు గానే కొనసాగుతుంది.
గత ఏడాది దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR వంటి సంచలన విజయం సాధించిన చిత్రం లో శ్రియ శరన్ ఒక కీలక పాత్ర పోషించింది.. రామ్ చరణ్ కి తల్లి గా ఆమె కాసేపు వెండితెర మీద కనిపించినప్పటికీ కూడా మంచి గుర్తింపు లభించింది.. అంతే కాకుండా అజయ్ దేవగన్ తో కలిసి ఆమె చేసిన ‘దృశ్యం 2 ‘ కూడా హిందీ లో పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది.. ఇప్పుడు కన్నడ లో ఉపేంద్ర మరియు సుదీప్ పాన్ ఇండియన్ మల్టీస్టార్ర్ర్ ‘కబ్జా’ అనే చిత్రం లో కూడా నటించింది.. ఇలా అన్ని బాషలలో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతుంది శ్రియ.