Purushothamudu ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత ‘ఉయ్యాలా జంపాల’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలిసినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న రాజ్ తరుణ్, ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ , కుమారి 21F,ఈడో రకం ఆడో రకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత ఆయనకీ వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం మొదలైంది. ఈ ఫ్లాప్స్ నుండి ఆయన తేరుకోలేకపోవడంతో ఆయన మార్కెట్ పూర్తిగా పొయ్యింది.
ఇక రీసెంట్ గా ఆయన తన మాజీ ప్రేయసి లావణ్య సృష్టించిన కాంట్రవర్సీ లో చిక్కుకొని ప్రతీ రోజు ట్రెండింగ్ లో ఉంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ వివాదం ని క్యాష్ చేసుకుందామని రాజ్ తరుణ్ దర్శక నిర్మాతలు అనుకున్నారు. అందులో భాగంగానే రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘పురుషోత్తముడు‘ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేసారు. వివాదాన్ని క్యాష్ చేసుకుందామని అనుకున్న నిర్మాతలకు ఎదురుదెబ్బ తగిలింది. కోటి రూపాయలకు పైగా థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి నాలుగు రోజులకు కలిపి కనీసం పాతిక లక్షల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు.
అంటే ప్రోమోషన్స్ కోసం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం, పబ్లిసిటీ కోసం చేసిన ఖర్చులను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. ఈ సినిమాతో పాటు రాజ్ తరుణ్ ‘తిరగబడరా సామీ’ అనే చిత్రం కూడా చేసాడు. ఈ చిత్రం లో ప్రస్తుతం రాజ్ తరుణ్ తో పాటు వివాదం లో చిక్కుకున్న మాల్వీ మల్హోత్రా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆగష్టు 2 వ తేదీన థియేటర్స్ లో విడుదల కానుంది. కనీసం ఈ సినిమా అయిన రాజ్ తరుణ్ కి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఇకపోతే రాజ్ తరుణ్ త్వరలో ప్రసారం అవ్వబోయే బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా రాబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో మరికొద్ది రోజుల్లో తేలనుంది.