రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ కల్కి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఊహించిన దానికన్నా ఎక్కువగానే కలెక్షన్స్ వస్తున్నాయి.. ఈ సినిమా అతి త్వరలోనే 1500 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కల్కి పోస్టులు పెడుతూ హంగామా చేస్తున్నారు.. 6 రోజులకు గాను ఈ సినిమా రూ.680 కోట్ల గ్రాస్ ను క్రాస్ చేసింది.. ఈ సినిమా స్టోరీ అందరికీ నచ్చడంతో సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇక ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన స్వప్న దత్ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను షేర్ చేసింది..
అదేంటంటే ఓ స్టార్ హీరో కు తనకు ఉన్న సంబంధాన్ని బయటపెట్టింది.. ఆ హీరో ఎవరో కాదు.. జూనియర్ ఎన్టీఆర్.. ఈయన నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే కాదు.. సొంత అన్న కన్నా ఎక్కువ అని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.. తనకు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగడానికి కూడా ఎన్టీఆర్ కారణం అని చెప్పింది.. త్రిపుల్ ఆర్ షూటింగ్ సమయంలో తన ప్రేమ విషయాన్ని మా ఇంట్లో చెప్పింది ఎన్టీఆర్ అని స్వప్న అన్నారు..
నేను ప్రసాద్ వర్మను ప్రేమించానని అయితే ఈ విషయాన్ని నాన్నకు చెప్పే ధైర్యం లేదని , మా ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో ఆయన ఖచ్చితంగా ఒప్పుకోరనే భయం ఉందన్నారు. అయితే ఈ విషయాన్ని శక్తి సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కు చెప్పాను.. అతను ఇలాంటి విషయాలను లేట్ చెయ్యకుండా చెప్పాలని చెప్పి, ఇంటికొచ్చి నాన్నను ఒప్పించి మా పెళ్లి జరిగేలా చేసింది ఎన్టీఆర్ అని చెప్పింది. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.. ఎన్టీఆర్ నాకు తోబుట్టువు అని ఆ ఇంటర్వ్యూలో చెప్పేసింది.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..