సినీ నటుల గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి యూట్యూబ్ లో తప్పుడు వార్తలు రావడం సహజం.. కొంతమంది తమ జేబులు నింపుకోవడం కోసం తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారు.. గతంలో చాలా ఛానెల్స్ బ్లాక్ అయ్యాయి.. తాజాగా మరో ఐదు ఛానెల్స్ బ్లాక్ అయినట్లు తెలుస్తుంది.. నటులు, వారి కుటుంబ సభ్యుల పట్ల అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై మా కొరడా ఝళిపించింది.. కొన్ని ప్రముఖ ఛానెల్ కు నోటీసులు పంపి బ్లాక్ చేసింది..
తాజాగా ఐదు యూట్యూబ్ ఛానెల్స్ ను బ్లాక్ చేసినట్లు మా అసోసియేషన్ అధికార ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనంటూ మిగిలిన యూట్యూబర్స్‌కు హెచ్చరిక పంపించింది.. అంతేకాదు కొన్ని యూట్యూబ్ ఛానళ్లల్లో ప్రసారమౌతోన్న అభ్యంతరకర, అసభ్య కంటెంట్‌తో కూడిన కథనాలపై ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. 48 గంటల్లోగా అలాంటి వాటిని తొలగించాలని హెచ్చరించాడు. మహిళల, సినీ నటులపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోబోమన్నాడు..
ఇటీవల కొన్ని కంటెంట్స్ జనాలను ఇబ్బంది పెట్టిస్తున్నాయి.. సెక్యువల్ కంటెంట్‌తో ఉన్న యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రతీ రోజు హీరో, హీరోయిన్లు, నటీనటులు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తనను కోరుతున్నారన్నాడు.. మరో రెండు రోజుల్లో ఇలాంటివి తొలగించకుంటే మాత్రం పోలీసులు రంగ ప్రవేశం చేస్తారని హెచ్చరించారు.. మరి మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది…