Kalki 2898AD రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన మూవీ కల్కి.. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు అవుతున్నా కూడా కలెక్షన్ రాబడుతుంది.. ఇప్పటికే 1000 వెయ్యి కోట్లకు పైగా సినిమా రాబట్టిన సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడూ వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా ఓటీటీ అప్డేట్ గతంలో వచ్చింది.. ఇప్పుడు కాస్త వాయిదా పడినట్లు తెలుస్తుంది.. ఓటీటీలో ఎప్పుడు వస్తుందో ఒక్కసారి చూసేద్దాం..
సాదారణంగా ఎంత పెద్ద సినిమాలు అయినా కూడా నెలలోపే విడుదలకు రెడీ అవుతాయి. కానీ ఈ సినిమా అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చెయ్యకపోవడం పై ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.. ఇక కల్కి ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో గట్టిగానే బజ్ వినిపిస్తుంది.. వచ్చే నెల ఆగష్టు 15 న ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కల్కి చిత్రం స్ట్రీమింగ్ అవుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
కల్కి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు తో పాటుగా ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.. నెట్ ప్లిక్స్ లో హిందీ స్ట్రీమింగ్ కానుంది.. సెప్టెంబర్ 2వ వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ రానుంది. కల్కి మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ తన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలతో కలిసి ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికార ప్రకటన వెలువడనుంది..