Actress Samantha టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానమైన బ్రాండ్ ఇమేజి ఉన్న హీరోయిన్స్ లో ఒకరు సమంత. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన ఈమె, ఆ చిత్రంతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ స్టేటస్ ని దక్కించుకుంది. వరుసగా మహేష్ బాబు , ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ వంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి భారీ హిట్స్ ని అందుకుంది. అలా కెరీర్ దూసుకుపోతున్న సమయం లో యంగ్ హీరో నాగ చైతన్య తో ప్రేమలో పడడం, అతన్ని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవడం వంటి సంఘటనలు వరుసగా జరిగిన సంగతి తెలిసిందే. అలా జీవితం లో ఎత్తుపల్లాలు, ఒడిదుడుగులను ఎదురుకున్న ఈమెకి మయోసిటిస్ అనే వ్యాధి సోకిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాధికి చికిత్స తీసుకున్న ఈమె, డాక్టర్ల సలహాల మేరకు కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే సమంత కి గొప్ప సామజిక స్పృహ ఉంది. ఆమె సంపాదించిన దాంట్లో నలుగురికి సహాయం చేసే తత్త్వం ఉన్న మనిషి ఆమె. విద్యార్థులను చదివించడం, ప్రకృతి పట్ల ప్రేమ చూపించడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. అంతే కాకుండా చెట్ల పెంపకం మీద పర్యావరణం కి ఉపయోగపడేలాగా ఈమె దగ్గర కొన్ని ఆలోచనలు ఉన్నాయట. ఆ ఆలోచనలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ తో పంచుకునేందుకు కోసం ఆయన అపాయింట్మెంట్ ని కోరిందట సమంత.
కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నాడు, అలాగే రేపటి నుండి వరుసగా వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ బిజీ కారణంగా అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాడట పవన్ కళ్యాణ్. అయితే మీకు సమయం దొరికినప్పుడే వచ్చే కలుస్తానని చెప్పిందట సమంత. వచ్చే నెలలో వీళ్లిద్దరి భేటీ ఉండొచ్చు. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరు కలిసి అత్తారింటికి దారేది అనే చిత్రం లో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కమర్షియల్ గా అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎటువంటి సినిమా రాలేదు. అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ సమయం తర్వాత మళ్ళీ వీళ్లిద్దరు కలుస్తున్నది ఇప్పుడే.