Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ప్రతీ ఒక్కరికి తెలిసిందే. సినిమాల్లోకి వచ్చే ముందే ఆయనకీ వైజాగ్ కి చెందిన నందిని రెడ్డి అనే అమ్మాయితో వివాహం అయ్యింది. కానీ పెళ్ళైన రెండేళ్లకే వీళ్ళ మధ్య కొన్ని విబేధాలు ఏర్పడి విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు రేణు దేశాయ్ తో ప్రేమాయణం నడిపిన ఆయన 2008 వ సంవత్సరం లో పెళ్లి చేసుకున్నాడు. సుమారుగా పదేళ్ల వరకు సాగిన వీరి దాంపత్య జీవితం కూడా కొన్ని విబేధాల కారణంగా మధ్యలోనే విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన ప్రస్తుతం అన్నా లెజినోవా తో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ కి వీళ్లందరికంటే ముందు ఒకరు అంటే బాగా క్రష్ అట.
ఆ క్రష్ కోసం ఏమైనా చేసే రకం అట. మనకి తెలియని ఆ క్రష్ ఎవరబ్బా?, స్కూల్ టైం లో, కాలేజీ టైం లో ఎవరైనా ఉన్నారా అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ ఆ క్రష్ మీద పవన్ కళ్యాణ్ చిన్నతనం నుండి నేటికీ కూడా వ్యామోహం పోలేదట. ఇంతకీ ఆ క్రష్ ఎవరో అమ్మాయి అనుకుంటే మీరు పప్పులో కాళ్ళు వేసినట్టే. ఆ క్రష్ ఎవరో కాదు, గన్. చిన్నతనం నుండి ఆయనకీ గన్ అంటే అంత పిచ్చి అట. మెగాస్టార్ చిరంజీవి హీరో అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కి ఎంతో ఇష్టమైన లైసెన్స్ గన్ ని కొనిచ్చాడట. దానిని పవన్ కళ్యాణ్ ఎంతో అపురూపంగా చూసుకుంటూ వచ్చాడు.
కానీ చిరంజీవి కూతురు ఎప్పుడైతే మా బాబాయ్ వల్ల నాకు ప్రాణహాని ఉంది అంటూ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసిందో, ఆరోజే పవన్ కళ్యాణ్ తన తుపాకీ ని తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇచ్చేసాడు. ఆరోజు నుండి నేటి వరకు ఆ తుపాకీ పోలీస్ స్టేషన్ లోనే ఉంది. పోలీసులు పవన్ కళ్యాణ్ కి పలు మార్లు గుర్తు చేస్తూ మీ తుపాకీ ని మీరు తీసుకెళ్లండి. లేకపోతే మీ లైసెన్స్ రద్దు చేస్తాం అని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ తీసుకోలేదు. దీంతో ఆయన గన్ లైసెన్స్ రద్దు అయ్యింది. ఆయన దగ్గర ఇప్పుడు గన్ లైసెన్స్ లేకపోయి ఉండొచ్చు కానీ, గన్ మీద ఇష్టం మాత్రం పోలేదు. ఇప్పటికీ కూడా ఆయన తన సినిమాల్లో తుపాకీ ని వాడుతూనే ఉంటారు. రీసెంట్ గా ఆయన హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రం లో కూడా గన్ ని విచ్చలవిడిగా వాడేసాడు.