Pathaan First Review : బాలీవుడ్ బాద్‌షా పఠాన్ ఫస్ట్ రివ్యూ.. హిట్టా.!? ఫ్లాపా.!?

- Advertisement -

Pathaan First Review : బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నాలుగేళ్ల విరామం తరువాత పఠాన్ సినిమా తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను యశ్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.. తాజాగా ఓవర్సీర్స్ సభ్యుడు ఉమైర్ సంధు Pathaan First Review ట్విట్టర్ రివ్యూ ఇవ్వగా ప్రస్తుతం వైరల్ గా మారింది..

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ సరసన దీపిక పదుకొనె నటించింది. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది‌.. సాధారణంగా డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ సినిమాలో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంటాయి ఇప్పుడు షారుక్ నటించిన పఠాన్ సినిమా కూడా అదే పంథాలో వచ్చింది..

- Advertisement -

డేంజరస్ సింథటిక్ వైరస్ రిలీజ్ ను నిరోధించేందుకు ఒక అండర్ కవర్ కాపు, మాజీ నేరస్థుడు కలిసి నిర్వహించే మిషన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు ఇప్పటికే కొన్ని వార్తలు లీక్ అయ్యాయి.. ఈసారి షారుఖ్ ఖాన్ స్ట్రాటజీని మార్చేశారు. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులను క్రియేట్ చేసింది.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో పాన్ ఇండియా రేంజ్ లో మూడో స్థానంలో నిలిచింది.. ఈ సినిమాలో హీరో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు.. ఈ సినిమాకి విశాల్ శేఖర్ సంగీతం సమకూర్చారు.

Pathaan First Review

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ సెన్సార్ బోర్డ్ సభ్యుడుగా చెప్పుకునే ఉమైర్ సందు పఠాన్ మూవీ రివ్యూ చెప్పేశారు.. పఠాన్ సినిమా పూర్తిగా మాస్ ఎంటర్టైనర్.. ఇప్పటివరకు నేను చూసిన బాలీవుడ్ చిత్రాలలో పఠాన్ ది బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్.. ఈ సినిమాలో షారుఖ్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలిచింది.. ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.. ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం.

బాలీవుడ్ లో పఠాన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తుంది. ఈ సినిమాకు నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను.. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాకి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాను.. మళ్ళీ ఇప్పుడు పఠాన్ సినిమా కి ఇస్తున్నాను అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు ఆ అర్హత ఈ సినిమాకు ఉందని నాకు అనిపిస్తుంది అంటూ.. ఉమైర్ సంధు ట్విట్టర్లో రాసుకొచ్చారు.. ట్విట్టర్ వేదికగా ఎక్కువ మంది ఈ సినిమా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కలెక్షన్ల పరంగా షారుఖ్ ఖాన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here