NTR For Oscars : ఇదీ యంగ్ టైగ‌ర్ NTR స‌త్తా.. ఆస్కార్ రేసులో నెంబ‌ర్ 1 ప్లేస్‌లో తార‌క రాముడు

- Advertisement -

NTR For Oscars : దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డ్రీమ్​ ప్రాజెక్ట్​ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకు ప్రశంస జల్లు కురుస్తోంది. కేవలం ప్రశంసలే కాదు పురస్కారాలు కూడా క్యూ కట్టాయి. జాతీయ స్థాయిలో కాదు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీకి క్రేజ్ వచ్చింది. క్రేజ్ తో పాటు అవార్డులు కూడా వచ్చాయి. రీసెంట్ గా ఈ సినిమా చూశామంటూ.. ఎంతో నచ్చిందంటూ హాలీవుడ్ డైరెక్టర్లు కూడా ప్రశంసలు కురిపించారు. 

NTR For Oscars
NTR For Oscars

ఇక ఈ మూవీ తర్వతా ఈ సినిమాలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పలికించిన హావభావాలకు పిచ్చి క్రేజ్ వచ్చింది. ఆర్​ఆర్​ఆర్​లో యాక్షన్‌ సీన్స్‌లోనే కాకుండే ఎమోషనల్‌ పరంగానూ తారక్‌ నటన కంటతడి పెట్టించింది. దీంతో ఆస్కార్‌ రేసులో ఉత్తమ నటుడి విభాగంలో తారక్‌ నిలుస్తారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మ్యాగజైన్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది టాప్‌-10 బెస్ట్‌ యాక్టర్స్‌ ప్రిడిక్షన్‌ లిస్ట్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో ఎన్టీఆర్‌కు అగ్రస్థానం దక్కడం విశేషం. టామ్ క్రూజ్, పాల్ డనో, మియా గోత్, పాల్ మెస్కల్, జో క్రవిట్జ్ తదితరుల పేర్లు కూడా టాప్‌-10 లిస్ట్‌లో ఉన్నాయి.

- Advertisement -

ఇక ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది. ఆస్కార్‌ నామినేషన్స్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సినీ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈసారి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఏదో ఒక విభాగంలో అయినా ఆస్కార్‌ దక్కుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి కొమురం భీమ్‌ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌కు ఆస్కార్‌ వరిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ మీడియా సంస్థ ‘వెరైటీ’ ఇప్పటికే టాప్-10 బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో ఎన్టీఆర్‌కు 10వ స్థానం దక్కింది. తాజాగా మరో అమెరికా వార్తా సంస్థ కూడా టాప్-10 బెస్ట్ యాక్టర్స్ ప్రిడిక్షన్ లిస్ట్‌ను ప్రకటించింది. యూఎస్ఎ టుడే అనే న్యూస్ డైలీ ప్రకటించిన ఈ జాబితాలో ఎన్టీఆర్‌కు అగ్రస్థానం దక్కడం విశేషం. ఒక ప్రముఖ అమెరికన్ న్యూస్ పేపర్ ఒక భారతీయ నటుడిని తమ ప్రిడిక్షన్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉంచడం మామూలు విషయం కాదు. ఈ జాబితాను పరిగణించండి అంటూ అకాడమీ ఓటర్లకు సూచించింది యూఎస్ఏ టుడే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here