Naga Chaitanya : అక్కినేని కుటుంబం నుండి వచ్చిన హీరోలలో మంచి సక్సెస్ రేట్ ని సాధించిన హీరో అక్కినేని నాగ చైతన్య. నాగార్జున తర్వాత మూడవ తరం లో రాణించిన ఏకైక హీరో ఇతనే. ఇతని సోదరుడు అక్కినేని అఖిల్ భారీ హైప్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు కానీ, ఇప్పటి వరకు ఒక్క సరైన కమర్షియల్ సక్సెస్ ని కూడా చూడలేకపోయాడు. మూడవ తరం అక్కినేని కుటుంబ ప్రతిష్ట మొత్తం ఇప్పుడు మోస్తున్నది అఖినేని నాగచైతన్య మాత్రమే. ఇతని కెరీర్ లో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటుగా, కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అందుకే యూత్ ఆడియన్స్ నాగ చైతన్య సినిమాలపై ప్రత్యేకంగా ఆకర్షితులు అవుతారు. అయితే ఈమధ్య కాలం లో ఆయనకీ సరైన హిట్ లేదు. ఆయన గత రెండు చిత్రాలైన థాంక్యూ, కస్టడీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.
కానీ ఈమధ్య కాలం లో ఆయన నుండి విడుదలైన ‘దూత’ అనే అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అయ్యింది. ఇండియా లోనే అత్యధిక వ్యూస్ ని సాధించిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ దూత వెబ్ సిరీస్ టాప్ 5 లో ఒకటిగా నిల్చింది. ఇప్పుడు ఆయన చందు మొండేటి తో ‘తండేల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇది కాసేపు పక్కన పెడితే నాగ చైతన్య కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే అతి త్వరలోనే ఆయన హైదరాబాద్ ని వీడి తన మకాం ని ముంబై కి షిఫ్ట్ చేయబోతున్నాడట. ఎందుకంటే ఆయనకీ వరుసగా బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా రీసెంట్ గా ఆయన పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో తన భవిష్యత్తు ప్లాన్స్ గురించి చెప్తూ, తనకి 45 ఏళ్ళు వచ్చిన తర్వాత హైదరాబాద్ ని పూర్తిగా వదిలి గోవా లో శాశ్వతంగా స్థిరపడాలని అనుకుంటున్నాడట. అక్కడి నుండే ఏడాదికి ఒక సినిమా చేస్తానని ఆయన చెప్పుకొచ్చాడు. నాగ చైతన్య కి ప్రస్తుతం 37 ఏళ్ళు. అంటే ఇంకో 8 ఏళ్లలో ఆయన హైదరాబాద్ ని పూర్తిగా వదిలేయబోతున్నాడు అన్నమాట.