Mahesh Babu #RRR వంటి సెన్సేషనల్ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోప్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ చిత్రం ఎప్పటి నుండి మొదలు అవుతుంది అనేదే అందరి ప్రశ్న. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ జరుగుతూ ఉందట. మహేష్ బాబు కి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా జరిగిపోయింది. ఆయన రీసెంట్ ఫోటోలను చూసిన అభిమానులు ఆశ్చర్యానికి గురి అయ్యారు. పొడవాటి జుట్టుతో, గుబురు గెడ్డం తో ఒక విమానాశ్రయం లో కనిపించిన మహేష్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు అభిమానులు ఎప్పుడూ చూడని లుక్ లో డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాలో చూపించబోతున్నాడు.
ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ కి మహేష్ బాబు ప్రతీ రోజు పాల్గొంటున్నాడట. ముఖ్యంగా ఈ సినిమాకి కొత్త తరహా డైలాగ్ డిక్షన్ అవసరం ఉందట. అందుకోసం ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ తో ప్రతీ రోజు మహేష్ కి ఆ డైలాగ్ డిక్షన్ ప్రాక్టీస్ సెషన్స్ చెయ్యిస్తున్నాడట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఈ చిత్రం లో ప్రముఖ మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ విలన్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో నటించబోయే నటీనటుల ఎంపిక దాదాపుగా ఖారారు అయ్యినట్టు తెలుస్తుంది. అక్కినేని నాగార్జున కూడా ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9 వ తేదీన ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు, ముహూర్తపు సన్నివేశం చిత్రీకరించి, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నాడట రాజమౌళి. తన ప్రతీ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ముందు సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ని చెప్పే అలవాటు ఉన్న రాజమౌళి, ఈసారి కూడా అదే చేయబోతున్నాడట. ఒక పక్కా ప్రణాళిక తో షూటింగ్ ని పూర్తి చేసి, 2026 వ సంవత్సరం లోపు ఈ చిత్రాన్ని అన్నీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. ఈ చిత్రం మొత్తం మూడు భాగాల్లో తెరకెక్కనుంది అని టాక్ వినిపిస్తుంది. ఈ వార్తకు సంబంధించిన క్లారిటీ కూడా త్వరలోనే రానుంది.