Kriti Sanon : ప్రభాస్ ‘మేడమ్’ కూడా అన్నీ చూపించేస్తుందిగా..?

- Advertisement -

Kriti Sanon.. బాలీవుడ్‌లో ఈమె ఇప్పుడో స్టార్ హీరోయిన్. వరుస అవకాశాలతో బీ టౌన్‌లో దూసుకెళ్తోంది. ఓవైపు సినిమాలు.. మరోవైపు యాడ్స్‌తో రెండు చేతులా సంపాదిస్తోంది. అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు టైగర్ ష్రాఫ్ , వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్ వంటి యంగ్ హీరోలతో ఆడి పాడుతోంది.

Kriti Sanon
Kriti Sanon

టాలీవుడ్‌లో ఈ బ్యూటీ మహేశ్ బాబు సరసన వన్ నేనొక్కడినే సినిమాతో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఈ సినిమాలో ఆవ్ తుజె మోక్కోడ్తా పాటలో కృతి అందాలకు తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత తెలుగులో నాగచైతన్య నటించిన దోచెయ్ సినిమాలో సందడి చేసింది. ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో ఇక ఈ భామ మళ్లీ తెలుగు తెరవైపు కన్నెత్తలేదు.

Kriti Sanon photos

ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో ఫుల్ బిజీ హీరోయిన్. రీసెంట్‌గా భేడియా మూవీలో నటించి సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ చిత్రంలో ఈ భామ ఓ డాక్టర్ గా నటించింది. ఈ సినిమా తెలుగులో తోడేలు పేరుతో డబ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ భామ హైదరాబాద్ వచ్చి తెలుగు ప్రేక్షకుల ప్రేమ ఏంటో రుచి చూసింది.

- Advertisement -
Kriti Sanon yellow dress photos

ఇక రీసెంట్‌గా కృతి బాలీవుడ్‌లో షెహజాదా అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తెలుగులో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో మూవీకి రీమేక్. బీ టౌన్‌లో ఈ చిత్రంలో హీరోగా కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం కృతి షెహజాదా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది.

Kriti Sanon images

షెహజాదా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కృతి సనన్ రోజుకో అవుట్‌ఫిట్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. తాజాగా నియాన్ కలర్ డ్రెస్సులో కృతి షెహజాదా ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ ఔట్‌ఫిట్‌లో కృతి అందాలు.. ఆకృతి .. క్లియర్‌గా కనిపిస్తోంది. ఈ ఫొటోలను కృతి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి చూసిన ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Kriti Sanon latest photos

ప్రభాస్ మేడమా మజాకా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మేడమ్ సార్ మేడమ్ అంతే.. కృతి ఏంటా ఆకృతి.. అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

Kriti Sanon new stills

మరోవైపు ఈ ఫొటోల్లో కృతి సనన్ కాస్త గ్లామర్ డోస్ బాగానే పెంచేసింది. వంగి వంగి తన అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది. మరికొందరు నెటిజన్లేమో ఏంటి కృతి నువ్వు కూడా ఉర్ఫీ డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Kriti sanon new pics
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here