సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఒక సినిమాలో పనిచేస్తున్నారు అంటే.. తప్పకుండా వారి మధ్య పరిచయం మాత్రమే కాదు.. కొన్ని కొన్ని సార్లు కొంతమంది మధ్య తెలియని రిలేషన్షిప్ కూడా ఉంటుంది. సినిమాలలో జోడి బాగుందని అంటే చాలు వారికి ఎక్కడలేని క్రేజ్ వస్తుంది. అలాగే వారికి వరుస అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్లో ఒక క్రేజీ జంట కి సూపర్ క్రేజ్ ఏర్పడింది. అంతేకాదు వీరు ఒకటి రెండు చిత్రాలలో నటించగా.. ఈ జోడీకి మరింత గుర్తింపు రావడమే కాకుండా అభిమానులు సూపర్ జోడి అంటూ పట్టం కట్టారు.
అయితే వరుసగా ఇద్దరు కలిసి పలు సినిమాలు చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు కోలీవుడ్ లో వీరిద్దరూ మూడు సినిమాలకు పైగా నటించడంతో నిజంగానే ఇద్దరి మధ్య ఏదో ఉందని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు బాగా వినిపించాయి. అంతేకాదు ఆ హీరోయిన్ మోజులో పడ్డ హీరో తనకు ఇచ్చిన పారితోషకాన్ని కూడా ఆమెకి ఇచ్చినట్లు వార్తలు బాగా వినిపించాయి. నిజానికి ఏ హీరో అయినా సరే డబ్బు కోసమే సినిమాలలో పని చేస్తారన్న విషయం తెలిసిందే. కానీ ఈ హీరో మాత్రం ఆ హీరోయిన్ మోజులో పడి ఆమెకు తన సినిమా పారితోషంగా కూడా ఇవ్వడంతో ఈ వార్త అప్పట్లో బాగా సంచలనంగా మారింది.
కానీ కొన్ని రోజుల తర్వాత ఆ హీరో ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకోవడంతో హీరోయిన్ మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తోంది.. అయితే ఆ హీరోయిన్ పై కూడా గత కొన్ని రోజుల నుంచి పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయి కానీ వాటిని ఆమె తిప్పికొట్టే ప్రయత్నం చేసింది . తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పట్లో లేదని తేల్చి చెప్పింది ఆ ముద్దుగుమ్మ.