Kamal Haasan అంటే తెలియని వారుండరు. విశ్వనటుడిగా ఆయన నటనలో ఎవరెస్ట్. కొన్ని దశాబ్ధాలుగా ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలను తన అభిమానుల కోసం అందిస్తూనే ఉన్నారు. తన కెరీర్లో తను చేయని పాత్ర లేదు. ఏ పాత్ర చేసినా అందులో జీవించేస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్, రజనీ కాంత్ మంచి దోస్తులు. వారిద్దరి మధ్య విడదీయరాని స్నేహం ఉంది. ఈ విషయాన్ని ఎన్నో సార్లు ఇద్దరూ వెల్లడించారు. ఈ విషయం పక్కన పెడితే కమల్ కి ఇండస్ట్రీలో లేడీస్ మ్యాన్ అనే పేరుంది.
తనకు చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందని.. ప్రేమ పేరుతో వాడుకుని వదిలేశారని ప్రచారం జరిగింది. తన బాటలోనే తండ్రి తగ్గ తనయ శృతిహాసన్ నడుస్తోంది.. ఆమె కూడా ఇప్పటికే ఎంతో మంది హీరోలతో ప్రేమాయణం నడిపిందన్న వార్తలు పుట్టుకొచ్చాయి. అలాంటి వారిలో ధనుష్, అనిరుధ్, నాగచైతన్య, శింబు, సిద్ధార్థ్ లాంటి చాలా మంది హీరోలున్నారు. వీళ్లను వదిలి ప్రస్తుతం శృతిహాసన్ శాంతాను హజరికా అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
ఇది ఇలా ఉంటే శృతిహాసన్ గతంలో ఓ స్టార్ హీరోతో సహజీవనం చేసిందట. ఈ విషయం తెలిసి తండ్రి కమల్ హాసన్ తనపై కోప్పడ్డాడట. కూతురిపై ఉన్న ప్రేమతో అతడిని ఏమీ అనలేక పోయాడట. ఎప్పుడైతే అతడు శృతిహాసన్ ని ప్రేమ పేరుతో వాడుకుని వదిలేశాడో.. అతడు చేసిన మోసం తట్టుకోలేక ఆ హీరోపై పొగపెంచుకున్నాడట. కూతుర్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాడనుకుంటే ఇలా చేస్తాడా అని కక్ష పెంచేసుకున్నాడట. దీంతో కోపంతో తనకు వచ్చిన సినిమా ఆఫర్లన్నీ పోగెట్టేశాడట. అంతేకాదు తన పలుకుబడిని ఉపయోగించి స్టార్ దర్శక నిర్మాతలకు ఆ హీరోను మీ సినిమాల్లో తీసుకోవద్దని హెచ్చరించాడట. కమల్ హాసన్ లాంటి వాడు వచ్చి అలా చెప్పడంతో దర్శక నిర్మాతలు కూడా ఆ హీరోని తమ సినిమాల్లో ఇప్పటికీ తీసుకోవడం లేదట. ప్రస్తుతం ఆ హీరో చిన్న చిన్న సినిమాలతోనే నెట్టుకొస్తున్నాడట. కానీ అప్పుడు ఉన్నంత స్టార్ డమ్ ఇప్పుడు తనకు లేకుండా పోయింది. కేవలం కమల్ వల్లే తమ అభిమాన హీరో జీవితం నాశనం అయిందని ఆయన అభిమానులు కమల్ హాసన్ ను తిట్టుకుంటూ ఉన్నారు.