Kalki 2898 AD : గత వారం కిందట కల్కి మేనియా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుంది.. కల్కి 2898 ఏడీ సినిమా ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోకపోయినా బాక్సాఫీస్ దగ్గర బాగానే పెర్ఫామ్ చేసింది. తొలి వీకెండ్లోనే రూ.500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించడమంటే మాటలు కాదు.. ప్రస్తుతం వెయ్యి కోట్ల క్లబ్ లోకి పరుగులు పెడుతుంది.. అయితే ఈ సినిమాకు మొదటి నుంచి భారీగానే అంచనాలు ఉన్నాయి.. వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలుపెట్టిన కల్కి కలెక్షన్స్ ఇప్పుడు దారుణంగా పడిపోయాయి.. దానికి కారణం టిక్కెట్ల ధరలని తెలుస్తుంది..
రెండో వీకెండ్ లో కలెక్షన్స్ తగ్గుతు వస్తున్నాయి.. రెండో వీకెండ్లోనూ కొత్త సినిమాలా జనాలను థియేటర్లకు రప్పించడంలో ‘కల్కి’ విజయవంతమవుతున్నట్లే కనిపిస్తోంది. శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కి’ థియేటర్లు జనాలతో కిక్కిరిసి ఉన్నాయి.. శనివారం సాయంత్రం, నైట్ షోలకు చాలా థియేటర్లు దాదాపు నిండిపోయాయి. హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయి. ఈ విషయంలో టికెట్ల ధరలు సాధారణ స్థాయికి రావడం ప్లస్ అయినట్లు కనిపిస్తోంది. తొలి వారం సగటున వంద రూపాయల దాకా అదనపు రేటు పెట్టాల్సి రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ వెనక్కి తగ్గారు..
ఇప్పుడు రేట్లు తగ్గడంతో మళ్లీ జనాలతో ఫుల్ అయ్యింది.. సినిమా విడుదల సమయంలో కన్న ఇప్పుడు రేట్లు తగ్గించడం వల్ల సినిమాకు వెళ్ళేవారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. రేట్లు వంద మేర తగ్గడంతో థియేటర్ ఫుల్ అవుతున్నాయి.. థియేటర్లలో చూడాల్సిన సినిమా అనే టాక్ రావడంతో ‘కల్కి’ని సాధారణ రేట్లతో జనం బాగా చూస్తున్న ట్రెండ్ కనిపిస్తోంది.. దీంతో కలెక్షన్స్ మళ్లీ పుంజుకోవడం పక్కా అని డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.. మొత్తానికి చూసుకుంటే 2000 కోట్ల క్లబ్ లోకి వెళ్లడం ఖాయమని తెలుస్తుంది..