అలనాటి తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ janhvi kapoor ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సంచలనం. తన హాట్ హాట్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుతూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. జిమ్ చేస్తున్న వీడియోలు పంచుతూ కుర్రకారుల మతి పోగొడుతోంది. ఫొటో షూట్ లలోనూ తన అందాలను ఆరబోస్తూ ఈ తరం యూత్ కి పిచ్చెకిస్తోంది. అయితే సోషల్ మీడియాను తన అందాలతో షేక్ చేస్తున్న ఈ భామ తాజాగా ఓ బాంబు పేల్చింది. తన అందాలు అభిమానుల కోసమే కాదట. సోషల్ మీడియాను తను అసలు పట్టించుకోనే పట్టించుకోదట. ఇదంతా కేవలం ఫన్ కోసమే అంట. ఫన్ కోసమే ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని చెబుతోంది ఈ ముంబయి బ్యూటీ.
జాన్వీ కపూర్ కు ఇన్ స్టాగ్రాంలో 20 మిల్లియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన అందాలతో వారిని అలరిస్తూ రకరకాల ఫోటో షూట్స్ చేస్తుందని అనుకుంటే అసలు విషయం అది కాదని తేల్చి చెప్పింది. తను సోషల్ మీడియానే పట్టించుకోను అని చెప్పడం నిజంగా షాకే. జాన్వీ అందాల ఆరబోత చూసిన కొత్తలో కొందరు శ్రీదేవి అభిమానులు .. అంత పెద్ద హీరోయిన్ కూతురు ఇలా రెచ్చిపోతే ఎలా కామెంట్స్ చేశారు. అయినా అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన జాన్వీ తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకుంది.
ఇటీవల మిలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది జాన్వీ. సినిమా ఎలా ఉందనే విషయం పక్కన పెడితే నటనతో మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. ఇక దక్షిణాది సినిమాలపై జాన్వి ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంది. అవకాశం వస్తే తెలుగు సినిమా లో నటించాలని అనుకుంటుంది. ఎన్.టి.ఆర్ తో జత కట్టే ఛాన్స్ వస్తే అస్సలు వదిలి పెట్టేదేలే అంటోంది. తన ఆప్త మిత్రుడు ఒర్హాన్‌తో సంబంధంపై కూడా జాన్వీ కపూర్ ఇటీవల స్పందించింది. ఒర్హాన్ ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసని.. అతడితో ఉంటే ప్రతిక్షణం ఆనందంగానే ఉంటానని వివరించింది. అన్నివిషయాల్లోనూ అతడు అండగా నిలిచాడని.. అతడిని ఎంతో నమ్ముతున్నాని.. అతడు తన పక్కన ఉంటే ఇంట్లో ఉన్నాననే భావన కలుగుతుందని చెప్పుకొచ్చింది.
View this post on Instagram